Asianet News TeluguAsianet News Telugu

ఒక్క ఓటుకు కోటి రూపాయల ఆఫర్

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు ఏ రేంజ్‌లో తాయిలాలు ప్రకటిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మద్యం, డబ్బు, బంగారం, వెండి, గృహోపకరణాలు ఇలా ఏది కావాలంటే అది ఇచ్చి ఓటరు దేవుణ్ని ప్రసన్నం చేసుకుంటారు.

one vote one crore rumours andhra pradesh bar council elections
Author
Vijayawada, First Published Nov 21, 2018, 7:40 AM IST

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు ఏ రేంజ్‌లో తాయిలాలు ప్రకటిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మద్యం, డబ్బు, బంగారం, వెండి, గృహోపకరణాలు ఇలా ఏది కావాలంటే అది ఇచ్చి ఓటరు దేవుణ్ని ప్రసన్నం చేసుకుంటారు.

ఇందుకోసం ఖర్చుకు సైతం వెనుకాడరు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవికి ఓటు వేస్తే కోటి రూపాయలు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో దాదాపు 24 వేల మంది న్యాయవాదులు ఓటింగ్‌లో పాల్గొని 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు.

ఈ 25 మంది సభ్యులు కలిసి కొత్త బార్ కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.. ఇందులో కౌన్సిల్ ఛైర్మన్ పదవికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు.. అతనికి ఐదేళ్ల పాటు విశేష అధికారాలు, హోదా ఉంటాయి.

ఈ నేపథ్యంలో ఆ పదవి కోసం పోటి పడుతున్న పలువురు.. తమకు ఓటేస్తే కోటీ రూపాయలు ముట్టజెబుతామని ఆఫర్ చేసినట్లుగా న్యాయవాద వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘‘ఓటుకు కోటి’’ వ్యవహారం తారాస్థాయికి చేరడంతో కొందరు న్యాయవాదులు దీనిపై విచారణ జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖలు రాశారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios