కాశెపు నూకాపతిరావు పా ర్టీకి గుడ్‌బై చెప్పి 200మంది అనుచరులతో శుక్రవారం టీడీపీలోకి చేరారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీ అధినేత జగన్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. జిల్లాల్లో కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు పార్టీలు మారుతున్నారు. వారితోపాటు వారి అనుచరులను కూడా వెంటపెట్టుకొని మరీ వెళుతున్నారు.

ఈ నెల 5వ తేదీ నుంచి జగన్.. పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర చేపడుతుండగా.. ఏలేశ్వరం మండలం వైసీపీ కన్వీనర్‌ కాశెపు నూకాపతిరావు పా ర్టీకి గుడ్‌బై చెప్పి 200మంది అనుచరులతో శుక్రవారం టీడీపీలోకి చేరారు. 

యోజకవర్గంలో బలమైన సామాజికవర్గాని కి చెందిన పర్వత, వరుపుల కుటుంబాలకు బంధువైన నూకాపతిరావు వై సీపీని వదిలివెళ్లడం పార్టీ శ్రేణులకు, నాయకులకు మింగుడు పడడంలేదు.

సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాశెపు నూకాపతిరావు తండ్రి కాశేపు సూ ర్యారావు భద్రవరం గ్రామానికి 35ఏళ్లపాటు ఏకగ్రీవ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన పేరవరం, సిరిపురం, భద్రవరం గ్రామాలకు కలిపి సొసైటీకి మరో 25ఏళ్లపాటు ఏకగ్రీవ అధ్యక్షుడిగా పనిచేశారు. 25ఏళ్లుగా కాశెపు నూ కాపతిరావు రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. 

వైసీపీ మండల కన్వీనర్‌గా నియోజకవర్గ నాయకులు తనకు గుర్తింపు ఇవ్వడంలేదని ఆయన అసంతృప్తికి లోనై పార్టీ వ్యవహారాలను చూసే పీకే బృందానికి ఫిర్యాదు చేశారు. పార్టీకి గుడ్‌బై చెప్పిన తర్వాత పీకే బృందానికి చెందిన వ్యక్తులు కాశెపుతో ఫోన్‌ సంప్రదింపులు జరిపినా ఆయన టీడీపీలోకి చేరిపోయారు.