వైసీపీని వీడి టీడీపీలో చేరిన సీనియర్ నేత

one more ycp ledaer jaoins in tdp
Highlights

పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

వైసీపీ అధినేత జగన్ కి మరో షాక్ తగిలింది. సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు జిల్లా నాయకులు పార్టీని వీడగా.. మరో సీనియర్ నేత శుక్రవారం టీడీపీ కండువా కప్పుకున్నారు.

విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సీనియర్ నేత ద్వారపురెడ్డి శ్రీనివాసరావు.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నేత అయినప్పటికీ.. పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

తాజాగా.. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.  వైసీపీలోని పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అలజంగి జోగారావు వ్యవహార శైలి నచ్చక కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. తెలుగు దేశం నాయకులు, పార్టీలోకి రావాలని ఆహ్వానించారన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరాలని వారు కోరినట్టు చెప్పారు. దీనితో టీడీపీలోకి వెళ్లనున్నట్టు శ్రీనివాసరావు మా ట్లాల్లో స్పష్టం అవుతుంది.

loader