Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి మరో తుఫాను గండం..? డిసెంబర్ 1 నుంచి మళ్లీ వర్షాలు!

తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా మారి.. బలపడి తుఫానుగా మారుతుందని, వచ్చే నెల 2న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది. 

One More Cyclone Affect on AndhraPradesh
Author
Hyderabad, First Published Nov 28, 2020, 7:36 AM IST


నివర్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై బాగా చూపించింది.  ఈ తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతాలకుతలం అయ్యాయి. ఇప్పటికీ అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా తుఫాను ప్రభావం తగ్గలేదు. ఇలాంటి తరుణంలో మరో తుఫాను గండం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

భూమధ్య రేఖకు సమీపంలో హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ స ముద్రంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 36గంటల్లో(29న) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా మారి.. బలపడి తుఫానుగా మారుతుందని, వచ్చే నెల 2న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటనుందని ఐఎండీ తెలిపింది. 

దీని ప్రభావంతో 1 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు.. 2న, 5వ తేదీన మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. 

‘నివర్‌’ తుఫాను గమనం అంచనాలకు భిన్నంగా సాగింది. వాయుగుండంగా బలహీనపడే క్రమంలో దిశ మార్చుకుంది. బుధవారం అర్ధరాత్రి తీరం దాటిన నివర్‌ వాయవ్యంగా పయనించి గురువారం రాత్రి వాయుగుండంగా బలహీనపడింది. ఇది మరింత బలహీనపడే క్రమంలో వాయవ్యంగానే అంటే కర్ణాటక మీదుగా పయనించా ల్సి ఉండగా.. దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనించి దక్షిణ కోస్తా పరిసరాల్లోకి వచ్చింది. 

తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు, పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఉంది. దీంతో గురువారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాను న్న 24 గంటల్లో కోస్తా, సీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని.. నెల్లూరు, ప్రకాశం, గుంటూరుల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. 

తీరం వెంబడి 45-55 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారు లు వేటకు వెళ్లవద్దని సూచించింది. కాగా, శుక్రవారం కోస్తా, సీమల్లో వర్షాలతో పాటు చలిగాలుల తీవ్రత కొనసాగింది. గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 4 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 1.9 నుంచి 8.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు  తగ్గాయి.

Follow Us:
Download App:
  • android
  • ios