అరకు విహారయాత్ర విషాదం... లోయలోకి దూసుకెళ్లిన కారు

ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు అందాలను వీక్షించేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం ప్రమాదానికి గురయ్యింది. 

One killed 10 injured road accident in Araku AKP

పాడేరు : ఓ కుటుంబం మొత్తం సరదాగా గడిపేందుకు చేపట్టిన విహారయాత్ర విషాదంగా మారింది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్ళింది. ఈ దుర్ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. 

విశాఖపట్నంకు చెందిన ఓ కుటుంబం అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకుకు విహారయాత్రకు వెళ్లింది. ఇన్నోవా కారులో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 11మంది ప్రయాణిస్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా మిగతా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను లోయలోంచి బయటకు తీసారు. తీవ్రంగా గాయపడిన వారిని దగ్గర్లోని అరకు హాస్పిటల్ కు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన  పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios