గుంటూరు:గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో సిలిండర్ పేలి శుక్రవారం నాడు ఒకరు మరణించారు.  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో  సెంట్రల్ ఏసీ  ఔట్‌డోర్ యూనిట్ లో ప్రమాదం చోటు చేసుకొంది.  గ్యాస్ నింపుతున్న సమయంలో సిలిండర్ పేలింది. దీంతో  ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలు ఏమిటనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రివర్గాలు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఈ విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సిలిండర్ పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని గుర్తించే విషయమై అధికారులు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.