విషాదాంతం : ఊయలలోనుంచి అదృశ్యమై.. కాలువలో శవమై తేలిన యేడాదిన్నర చిన్నారి..

నెల్లూరులో చిన్నారి అదృశ్యం ఘటన విషాదాంతంగా ముగిసింది. ఊయలలో పడుకున్న చిన్నారిని స్థానంలో బొమ్మను పెట్టి ఎత్తుకెళ్లారు. ఆ చిన్నారి కాలువలో శవంగా తేలింది. 

one and half year old baby girl missing and found dead in nellore - bsb

నెల్లూరు : నెల్లూరులో ఓ చిన్నారి మిస్సింగ్ కేసు విషాదాంతం అయ్యింది. రెండు రోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఊయలలో పడుకున్న చిన్నారి స్థానంలో బొమ్మను ఉంచి చిన్నారిని ఎత్తుకెళ్లారు.  ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చేపట్టారు. ఆదివారం రాత్రి అదృశ్యమైన చిన్నారి.. రెండు రోజుల తర్వాత మృతదేహంగా దొరికింది. ఇంట్లో నుంచి అదృశ్యమైన చిన్నారి హారిక సర్వేపల్లి కాలువలో మృతదేహంగా తేలింది. 

కాలువలో చిన్నారి మృతదేహానికి సంబంధించిన సమాచారం అందడంతో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని వెలికి తీయించారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చిన్నారి మరణం మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్య చేయడం కచ్చితంగా.. రక్తసంబంధీకుల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

అమరావతికి మారీచుడు సీఎం జగనే, ఆయనతోనే ప్రజలంతా యుద్ధం చేయాలనుకుంటున్నారు... రఘురామ

అంతేకాదు.. కుటుంబ సభ్యులను విచారిస్తున్న క్రమంలోనే…వారు ఇచ్చిన సమాచారం మేరకే కాలువలో గాలింపు చేపట్టినట్లు కూడా తెలిపారు. దీనికి సంబంధించి పోలీసులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. అనూష, మణికంఠ దంపతులు..   అనూషది గుర్రాల మడుగు సంఘం.. కాగా, మణికంఠది రావూరు.   వీరికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది.

మణికంఠ హోటల్ నడుపుతున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అనూష భర్తకు దూరంగా.. ఎంసీఏ చదువుకుంటూ గుర్రాల మడుగు సంఘంలోనే తల్లిగారింట్లో ఉంటుంది. హోటల్ నడిపే భర్త మణికంఠ గుర్రాల మడుగు సంఘానికి అప్పుడప్పుడు వచ్చి భార్య, పిల్లలను చూసి వెళుతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం నాడు..  గుర్రాల మడుగు సంఘంలోని తన తల్లి ఇంట్లో ఉన్న అనూష.. తల్లి ఏదో పనిమీద వేరే ఊరికి వెళ్లడంతో.. ఇంట్లో ఇద్దరు పిల్లలతో ఒక్కతే ఉండాల్సి రావడంతో దగ్గర్లోనే ఉన్న తన పిన్ని ఇంటికి వెళ్లింది.. 

అర్ధరాత్రి కరెంటు పోయింది. దీంతో ఉక్కపోతకు తలుపులు తీసి పడుకుంది. ఉదయం లేచి చూసేసరికి  ఊయలలో ఉండాల్సిన ఏడాదిన్నర కూతురు హారిక లేదు. కూతురికి బదులు ఊయలలో బొమ్మ కనిపించింది. దీంతో కంగారుపడిన అనూష వెంటనే భర్తకు సమాచారం అందించింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న భర్త.. కుటుంబ సభ్యులందరితో కలిసి చుట్టుపక్కలంతా గాలించారు. కానీ,  చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు చిన్నారి మృతదేహంగా లభించడంతో కుటుంబ కలహాల నేపథ్యంలోనే.. చిన్నారిని బలి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios