ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన కాంగ్రెస్ కండువాని మరోసారి కప్పుకోనున్నాడని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

పార్టీలో చేరేముందు ఆయన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రేపో మాపో ఆయన దిల్లీకి వెళ్లనున్నారట. 13న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని..దిల్లీలో రాహుల్‌ సమక్షంలో పార్టీ కండువ కప్పుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాహుల్‌గాంధీ నల్లారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

అయితే కాంగ్రెస్‌లో చేరే విషయమై తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఇలాంటి వార్తలు తాను టీవీ ఛానళ్లలోనే చూస్తున్నానని చెబుతున్నారు.