Asianet News TeluguAsianet News Telugu

కోస్తా జిల్లాల్లో Omicron విజృంభ‌న‌.. కరోనా పాజిటివ్‌ కేసుల్లో 84 శాతం ఆ కేసులే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఓమిక్రాన్ విజృంభిస్తోంది. మ‌రి ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.  ప్రస్తుతం నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి.  జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు వస్తున్న శాంపిల్స్‌ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు.
 

Omicron variant widely prevalent in APs six coastal districts
Author
Hyderabad, First Published Jan 22, 2022, 10:23 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి బుస‌లు కొడుతోంది. వ‌రుస‌గా భారీ సంఖ్య‌లో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ త‌ర్వాత.. ఈ కేసులు సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా  పైకే క‌దులుతోంది. ఓవైపు టెస్ట్‌ల సంఖ్య త‌గ్గినా.. మ‌రోవైపు ఓమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కోస్తా జిల్లాల్లో Omicron వేరియంట్ విస్తృతంగా ప్రభలుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 84 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్ కేసులే కావ‌డం గ‌మ‌న్హారం. 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా   జిల్లాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయినా.. 425 నమూనాలలో 84 శాతం ఓమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, 10 శాతం డెల్టా వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయ‌ని  అధికారులు తెలిపారు.

తాజా సిద్దార్థ ప్రభుత్వ వైద్యశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అంతర్జాతీయ ప్రయాణికులు, అలాగే వారి ప్రైమ‌రీ క‌న్ టాక్స్ ల న‌మూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు వస్తున్న శాంపిల్స్‌ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. వైరస్‌ సోకితే ఎదురయ్యే పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకుని, అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా  ఆరు జిల్లాల నుంచి ఆరోగ్యశాఖ అధికారులు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నారు.

 ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షల వివరాలను తెలియజేశారు.  శ్రీకాకుళం నుండి కృష్ణా వరకు ఆరు కోస్తా జిల్లాల్లో ఓమిక్రాన్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంద‌ని తెలిపారు. సేక‌రించిన న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం మిగిలిన ఏడు జిల్లాలకు చెందిన అంతర్జాతీయ ప్రయాణికులు, వారిని కాంటాక్ట్ అయినా వారిని నమూనాలను హైదరాబాద్‌లోని CCMBకి పంపుతున్న‌మ‌ని తెలిపారు. ఈ జిల్లాల్లో సి-వేరియంట్‌ల ప్రాబల్యం  పెరుగుతోన్న‌ట్టు తెలుస్తోందని తెలిపారు. 

కరోనా సెకెండ్ వేవ్ తో పోలిస్తే కేసుల వేగం స్పీడ్ గా ఉన్నా.. ప్రస్తుతానికి ప్రభావం తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. చేరుతున్న వారు సైతం త్వరగానే కోలుకుంటున్నారు.. పాజటివ్ వచ్చిన వారంలోపే మళ్లీ వారికి నెగిటివ్ వస్తోంది. దీంతో ఒమిక్రాన్ గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios