జరుగుతున్న పరిణామాలతో ఇంటర్ బోర్టు ఉన్నతాధికారులకు కూడా ధైర్యం వచ్చినట్లుంది. విద్యార్ధుల విషయంలో కార్పొరేట్ విద్యాసంస్ధల యాజమాన్యాల వేధింపులను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివసరావు దృష్టికి తెచ్చారు. అంటే ఇప్పటి వరకూ గంటాకు తెలీదని కాదు. కానీ అధికారపూర్వకంగా ఓ సమావేశంలో అందరిముందు చెప్పటమే గమనార్హం.

ఏడాదికి కాలేజీలు 220 రోజులు మాత్రమే పనిచేయాలట నిబంధనల ప్రకారం. కానీ కార్పొరేట్ విద్యాసంస్ధలు మాత్రం 300 రోజులు పనిచేస్తున్నాయట. వారానికి 24 గంటలు మాత్రమే తరగతులు జరగాలి. కానీ 60 తరగతులు జరుగుతున్నాయట. ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకూ మాత్రమే తరగతులు నడవాలి. కానీ ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటల వరకూ తరగతులు జరుగుతాయి.
సెలవులకు విద్యార్ధులను ఇళ్ళకు కూడా పంపరట. ఆదివారాలు కూడా సెలవులుండవట. ఉన్నతాధికారులు చెప్పేదాని ప్రకారం కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్ధుల వ్యక్తిత్వ వికాశం కన్నా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్ధుల వ్యక్తిత్వ వికాశమే మెరుగ్గా ఉంటోందట. కార్పొరేట్ కళాశాలల విద్యార్ధులు రికార్డులు రాయకుండా రూ. 10 వేలు ఇచ్చి బయట వ్యక్తులతో రాయిస్తారని ఫిర్యాదు చేసారు. పైగా ఒక్కో తరగతిలో 90 మంది విద్యార్ధులుంటున్నట్లు తెలిపారు.

ఏడాదిలో పూర్తి చేయాల్సిన సిలబస్ ను 5 నెలల్లోనే పూర్తి చేసేసి మిగితా రోజుల్లో ఐఐఐటి, నీట్, జెయియి వంటి ఇతర సిలబస్ లు చెబుతుండటంతోనే విద్యార్ధులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతుందని ఉన్నతాధికారులు వివరించారు. అందుకే నిబంధనలు పాటించని 805 కాలేజీలకు నోటీసులు జారీ చేసారట. వాటిల్లో 234 కాలేజీల గుర్తింపును కూడా రద్దు చేసినట్లు చెప్పారు.
అయితే, గుర్తింపు రద్దయిన కాలేజీల వివరాలు మాత్రం చెప్పలేదు. మరో 134 కాలేజీల గుర్తింపును కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలపై నిజంగానే ప్రభుత్వం గనుక కఠిన చర్యలు తీసుకుంటే నారాయణ, చైతన్య కళాశాలలు నూరుశాతం మూతపడాలి. మరి, ప్రభుత్వంలో చిత్తశుద్ది ఉందా?