బతుకు దెరువు కోసం ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ వలస వచ్చారు. ఇక్కడే ఏదో ఓ పని చేసుకుంటూ జీవితాన్ని సాగదీస్తున్నారు. కాగా.. అనుకోకుండా ఒడిశా యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన మాడపల్లి పద్మ (24) ఈ పరిశ్రమలో కార్మికురాలు. సహచర ఉద్యోగితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపానికి గురైన పద్మ ఫాక్యరీలోనే విధుల్లో ఉండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది .

పద్మ అక్కడికక్కడే మృతి చెందగా ఈ ఘటనను చూసిన ఒడిశాకు చెందిన సహచర యువతులు సోనాలి, మనీషా, గంగీలు అపస్మారక స్థితిలోకి చేరారు. దీంతో స్థానికులు వారిని పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న ఎస్సై వి,సురేష్‌  మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.