విశాఖపట్టణం: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో వలస కూలీలు తమ స్వంత గ్రామాలకు తిరుగు పయనమయ్యారు. చెన్నై నుండి ఒడిశా రాష్ట్రంలోని గంజాం ప్రాంతానికి కూలీలు వారం రోజుల క్రితం బయలుదేరారు. బుధవారం నాడు కూలీలు విశాఖపట్టణానికి చేరుకొన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ ను విధించారు. తొలుత ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు గాను మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ప్రధానమంత్రి మోడీ నిర్ణయం తీసుకొన్నారు.

ఒడిశా రాష్ట్రంలోని గంజాం ప్రాంతానికి చెందిన వలస కూలీలు కొద్ది రోజులుగా చెన్నైలో నివాసం ఉంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వీరికి ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకనే కూలీలు ఒడిశా కు బయలుదేరారు.
also read:కరోనా వైరస్: ఏపీలో కొత్తగా 19 కేసులు నమోదు, 11 మంది మృతి

వారం రోజుల క్రితం వీరంతా చెన్నై నుండి బయలుదేరారు. బుధవారం నాడు కూలీలు విశాఖపట్టణానికి చేరుకొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తే ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని భావించిన కూలీలు అటవీ మార్గం గుండా ప్రయాణం సాగిస్తున్నారు. విశాఖ నుండి ఒడిశాలోకి ప్రవేశించనున్నారు. 

తమ వెంట లగేజీతో పాటు కూలీలు రోజుల తరబడి నడుచుకొంటూ తమ గ్రామానికి ప్రయాణం సాగిస్తున్నారు.