విచారణ పేరుతో మహిళను లాడ్జ్ కు రమ్మంటున్న ఎస్ఐ

nuzvid si  asks house wife to come to lodge for an inquiry
Highlights

విచారణ పేరుతో గృహిణిని లాడ్జ్ కు రమ్మంటున్న ఎస్ ఐ

నూజివీడుకు చెందిన ప్రయివేటు స్కూల్ టీచర్ ను  స్థానిక ఎస్ ఐ చేస్తున్నవేధింపుల  వ్యవహారం కృష్ణా జిల్లా ఎస్ పికి చేరింది. దీని మీద విచారణ మొదలయింది.  టీచర్  భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి.ఆఫీసుకు సంబంధించిన  ఫైల్ ఒకటి మాయం కావడంతో ఆయన ఆ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు  మీద విచారణలో భాగంగా ఎస్ ఐ వెంకట్ కుమార్ వారి ఇంటికి వచ్చాడు. టీచర్ ను చూశాడు. అంతే, విచారణ అం టూ రెగ్యులర్ ఆమెకు ఫోన్ చేయడం మాట్లాడటం ప్రారంభించాడు. అంతేకాదు, విచారణకు లాడ్జ్ కు రమ్మని కూడా అంటున్నాడు. ఈ ఫోన్ వేధింపులు ఎంతకూ ఆగలేదు. దీనితో ఆమె ఆదివారం నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేసింది. టెలిఫోన్ సంభాషణ రికార్డులను కూడ అందించింది. ఎస్ ఐ ని ఎస్ పి పిలిపించనట్లు సమాచారం. ఈ విషయం స్థానిక పత్రికలలో రావడంతో వైరల్ అయింది.

loader