రౌడీషీటర్‌‌ను పోలింగ్ కేంద్రం వైపు వెళ్లనీయం: చింతమనేని, నూజివీడు డీఎస్పీ మధ్య వాగ్వాదం

ఏలూరు జిల్లాలోని పెద్దపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ పోలింగ్ ను పురస్కరించుకొని గ్రామంలోకి వెళ్లేందుకు  ప్రయత్నించిన చింతమనేనిని ప్రభాకర్ ను  డీఎస్పీ అడ్డుకున్నారు

Nuzvid  DSP Warns  Denduluru Former MLA  Chintamananeni prabhar lns

ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు  నూజివీడు డీఎస్పీ ఆశోక్ కుమార్  శనివారంనాడు వార్నింగ్ ఇచ్చారు.ఏలూరు జిల్లాలోని  పెదపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానంలో విజయం సాధించాలని  టీడీపీ, వైసీపీ  పట్టుదలగా ఉన్నాయి.  ఇవాళ  ఉదయం వీరమ్మకుంట పోలింగ్ కేంద్రం వైపు  మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ వెళ్తున్న సమయంలో నూజివీడు  డీఎస్పీ  ఆశోక్ కుమార్  ప్రభాకర్ ను ఆపారు.

రౌడీషీటర్ ను  పోలింగ్ కేంద్రం వైపు రావొద్దని  డీఎస్పీ  కోరారు. రౌడీషీటరైతే  ఎందుకు  బైండోవర్ చేయలేదని  మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  డిఎస్పీ ఆశోక్ కుమార్ ను ప్రశ్నించారు. దీంతో  వీరిద్దరి మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది.పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నఅందరిని  పంపితే  తాను  కూడ వెనక్కి వెళ్లిపోతానని  చింతమనేని ప్రభాకర్ చెప్పారు.  అయితే ముందు తనకు  మీరు సహకరించాలని చింతమనేని ప్రభాకర్ ను కోరారు డీఎస్పీ ఆశోక్ కుమార్..

also read:ఏలూరు వీరమ్మకుంట సర్పంచ్ ఉపఎన్నిక పోలింగ్: టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణ

ఇదిలా ఉంటే  మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను గ్రామంలోకి అనుమతించాలని ఆ గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు డీఎస్పీని కోరారు.అయితే  డీఎస్పీ నిరాకరించారు. అయితే  ఎవరున్నా, ఎవరు రాకపోయినా  గెలుపును, ఓటమిని ఆపలేరని  చింతమనేని  ప్రభాకర్  టీడీపీ కార్యకర్తలకు చెప్పారు. డీఎస్పీ సూచన  మేరకు  చింతమనేని ప్రభాకర్ అక్కడి నుండి వెళ్లిపోయారు.దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని  ఈ స్థానాన్ని దక్కించుకోనేందుకు  ఈ రెండు పార్టీలు పోటా పోటీగా  ప్రచారం చేశాయి.  మూడు రోజుల క్రితం ప్రచారం సందర్భంగా రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు  చేసుకుంది.ఈ సమయంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ ను పురస్కరించుకొని ఇవాళ కూడ రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ చోటు  చేసుకుంది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను  పోలింగ్ కేంద్రం వద్ద నుండి పంపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios