ఏలూరు: వింత వ్యాధి బారిన ఓ నర్సు కూడ పడ్డారు. ఉదయం నుండి వింత వ్యాధికి గురైన రోగులకు చికిత్స అందించడంలో డాక్టర్లకు సహాయం అందించిన నర్సు  సోమవారం రాత్రి కుప్పకూలింది.

నర్సు రంజనిలో ఫిట్స్  లక్షణాలు కన్పించాయి. దీంతో ఆసుపత్రి సిబ్బందిలో ఆందోళన నెలకొంది., 108 అంబులెన్స్ లో పనిచేసే సిబ్బంది కూడ ఈ వ్యాధి బారినపడుతున్నారని తేలింది.

also read:ఏలూరుకి చేరుకున్న డబ్ల్యుహెచ్ఓ డాక్టర్ భవానీ: కూరగాయలను పరీక్షకు పంపిన అధికారులు

వింత వ్యాధితో నర్సు రంజని కుప్పకూలింది. వెంటనే ఆమెకు అదే ఆసుపత్రిలో చికిత్స  అందిస్తున్నారు.  ఈ వ్యాధి బారిన 451 మంది పడ్డారని అధికారులు ప్రకటించారు. ఈ వ్యాధికి గురైన వారిలో 168 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు తెలిపారు.గంట గంటకు బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో  స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

అనారోగ్యానికి గురైన వారిలో 9 మందిని విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు.   వింత వ్యాధిపై డిప్యూటీ సీఎం ఆళ్లనాని సమీక్షించారు.