తిరుపతి: తిరుపతి కోర్టు ఆవరణలో డాక్టర్‌ ఆదర్శ్‌రెడ్డిపై  ఓ మహిళ గురువారం నాడు యాసిడ్‌ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆదర్శ్‌రెడ్డి తృటిలో తప్పించుకొన్నారు.

విడాకుల కేసులో డాక్టర్ ఆదర్శ్ రెడ్డి గురువారం నాడు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ సమయంలోనే డాక్టర్ ఆదర్శ్ రెడ్డి వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ బురఖా వేసుకొని వచ్చి యాసిడ్‌తో దాడికి ప్రయత్నించింది.

అయితే ఈ ఘటనలో  డాక్టర్ ఆదర్శ్ రెడ్డి తృటిలో తప్పించుకొన్నాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని డాక్టర్ మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.