వైసీపీ ఎమ్మెల్యే నంబురు శంకరరావు టీడీపీపై, నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అన్నదాతల గురించి టీడీపీ ప్రభుత్వం ఆలోచించలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని విమర్శించారు.

టీడీపీ నాయకుడు లోకేష్ ను పప్పు అని ఎందుకు పిలుస్తారో తనకు ఇప్పుడు అర్థం అవుతోందని వైసీపీ ఎమ్మెల్యే నంబు శంకరరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో నారా లోకేష్ చెప్పాలని ప్రశ్నించారు. రూ.2400 కోట్లతో అభివృద్ధి చేశామని ఆయన చెబుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. కానీ అదంతా అబద్దమని తెలిపారు. 

మణిపూర్ సమస్యకు పరిష్కారం హృదయం నుంచి రావాలి.. బుల్లెట్లలో నుంచి కాదు - రాహుల్ గాంధీకి అస్సాం సీఎం కౌంటర్..

లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శంకరరావు విమర్శించారు. ఆయన ఓ అయోమయంలా తయారు అయ్యాడని ఎద్దేవా చేశారు. టీపీడీ నాయకులను ప్రజలు ఛీ కొడుతున్నారని ఆరోపించారు. అన్నదాతల గురించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఆలోచించిందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టీడీపీ నాయకులైన చంద్రబాబు నాయుడు, లోకేష్ లు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

బర్త్ డే ఉందని పిలిచి యువతిపై ఎస్ఐ రేప్.. మత్తు మందు ఇచ్చి దారుణం.. కేసు నమోదు చేసిన పోలీసులు..

లోకేష్ చేపడుతున్న యువగళం పాదయత్రకు ప్రజలు సహజంగా రావడం లేదని ఎమ్మల్యే శంకరరావు విమర్శించారు. డబ్బులు, మద్యం, చీరలు పంపిణీ చేసి ప్రజలను సమీకరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడాలని, ధైర్యం ఉంటే దీనిపై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు.

వివాహేతర సంబంధానికి ఒప్పుకోవడం లేదని మాజీ ప్రియుడి కుమారుడిని హతమార్చిన మహిళ.. ఎక్కడంటే ?

తాను 400 ఎకరాల ఆటవీ భూమిని ఆక్రమించాని లోకేష్ ఆరోపిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అందులో వెంచర్ వేశానని చెపుతున్నారని తెలిపారు. తాను ఆక్రమించిన భూమి ఎక్కడుందో చూపించాలని శంకర రావు చెప్పారు. అలా చూపిస్తే దానిని పేదలకు పంచేస్తానని స్పష్టం చేశారు.