సరైన సమయంలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం: ఏపీ మంత్రి సురేష్
టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకొంటామని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ చెప్పారు.
అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకొంటామని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ చెప్పారు.గురువారం నాడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యాశాఖలో నాడు నేడు అనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడారు. పరీక్షల విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకొంటామన్నారు. పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు నోటీసుల విషయం తమ దృష్టికి రాలేదన్నారు.ఈ విషయమై సుప్రీం నోటీసులు వస్తే తమ స్టాండ్ వినిపిస్తామని ఆయన చెప్పారు.
also read:కాసేపట్లో విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష: టెన్త్, ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్
కరోనా నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే ఈ పరీక్షలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కొరకే పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నామని ఏపీ సర్కార్ చెబుతోంది. జూలై మాసంలో పరీక్షలు నిర్వహించాలని జగన్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.