ఇవాళే తీర్పు చెప్పలేం: వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పును వెల్లడించలేమని హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేయాలని హైకోర్టు సూచించింది.
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ వినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ వాదనలు విన్నా కూడా తీర్పు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఈ విషయమై హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేయాలని తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయవాదులకు సూచించింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇవాళ మధ్యాహ్నం తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. ఈ పిటిషన్ పై తమ వాదనలు కూడా వినాలని వైఎస్ సునీతారెడ్డి తరపు న్యాయవాది కోరారు. మరో వైపు తమ వైపున కూడా ఇంకా వాదనలు మిగిలి ఉన్నాయని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. మరో వైపు ఈ కేసులో వాదనలు విని ఇవాళే తీర్పు చెప్పాలని హైకోర్టును వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు.
అయితే హైకోర్టుకు రేపటి నుండి వేసవి సెలవులున్నాయని హైకోర్టు తెలిపింది. ఇప్పటికిప్పుడు వాదనలు విన్నా తీర్పును వేసవి సెలవుల తర్వాతే ఇవ్వాల్సి ఉంటుందని జస్టిస్ సురేంద్ర చెప్పారు. వేసవి సెలవుల వరకు తీర్పు ఇవ్వకుండా రిజర్వ్ చేయడం సరికాదన్నారు. ఈ పిటిషన్ పై ఆర్జన్సీ ఉందని భావిస్తే వేకేషన్ బెంచ్ కు మార్చుకుంటారా అని కూడా హైకోర్టు ప్రశ్నించింది.
ఈ తరుణంలో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దదని సీబీఐని ఆదేశించాలని హైకోర్టును వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయవాది కోరారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ రకమైన ఆదేశాలు ఇవ్వలేమని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ పై విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై వాదనలు విని తీర్పును ఇవ్వాలని హైకోర్టును ఇరుపక్షాలు కోరాయి. అయితే చీఫ్ జస్టిస్ ను ఈ విషయమై అభ్యర్ధించాలని హైకోర్టు జస్టిస్ సురేంద్ర సూచించారు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ పై వాదనలు విని తీర్పు చెప్పాలని కోరారు.
also read:వైఎస్ వివేకా హత్య కేసు: నిందితులను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినేందుకు కూడా చీఫ్ జస్టిస్ నికరారించారు. ఇవాళ , రేపు, ఎల్లుండి వాదనలు వినాలని కోర్టుపై ఒత్తిడి తీసుకురావద్దని కోరారు. ఈ కేసు విషయమై సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యలు చేసిందని హైకోర్టు చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. వేసవి సెలవుల్లో పనిచేసే వేకేషన్ కోర్టుల ముందు మెన్షన్ చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచించారు.