తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వారి పాదల వద్ద తాకట్టు పెట్టినందుకు ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుందన్నారు.
ప్రతి ఇంటా తన ఫొటో ఉండాలన్న తాపత్రయంతోనే తాను కృషి చేస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి అన్నారు. చనిపోయిన తన తండ్రి ఫొటో ప్రతీ ఇంటిలోనూ ఎలా ఉందో తాను చనిపోయిన తర్వాత తన తండ్రి ఫొటోతో పాటు తన ఫొటో కూడా ఉండాలని జగన్ ఆకాంక్షించారు. తనకు డబ్బు మీద ఆలోచన లేదన్నారు. చంద్రబాబుకు తనకు తేడా అదేదనంటై జగన్ చెప్పారు. ప్రత్యేకహోదా కోసం గుంటూరు సమీపంలో నిర్వహించిన ‘యువభేరి’ కార్యక్రమంలో ప్రసంగించారు.
అనంతరం చంద్రబాబునాయుడు గురించి మాట్లాడుతూ, సిఎం దెబ్బకు టిడిపి వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుందన్నారు. తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని చంద్రబాబునాయుడు ఢిల్లీ వాళ్ల కాళ్ల వద్ద తాకట్టు పెట్టినట్లు ధ్వజమెత్తారు. తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వారి పాదల వద్ద తాకట్టు పెట్టినందుకు ఎన్టీఆర్ ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుందన్నారు.
ప్రత్యేకహోదాపై గుంటూరు వద్ద జరిగిన ‘యువభేరి’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇద్దరు నాయడులు వెన్నుపోటు పొడిచారని జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయడు ఇద్దరూ పోటీలు పడి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేసిన విషయాన్ని జగన్ గుర్తుచేసారు. ఎన్నికలైపోయిన తర్వాత అధికారం అందుకోగానే ఇద్దరూ ప్రత్యేకహోదా అంశాన్ని పక్కనపడేసినట్లు ఆరోపించారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నపుడు ప్రత్యేకహోదా అక్కర్లేదని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఓటుకునోటు కేసులో ఇరుక్కుని ఆ కేసులో నుండి బయటపడేందుకు కేంద్రం ఆడమన్నట్లు చంద్రబాబు ఆడుతున్నట్లు ఆరోపించారు. యువభేరి సందర్భంగానే రాష్ట్ర విభజన సమయంలోనూ తర్వాత ఎన్నికల సందర్భంలో కూడా ప్రత్యేకహోదా అంశంపై వెంకయ్యనాయడు, నరేంద్రమోడి, చంద్రబాబునాయుడులు ఏమన్నారో ఆనాటి వారి డిమాండ్లను, హామీలను వినిపించారు.
జగన్ ప్రసంగం తర్వాత విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడుతూ, చంద్రబాబు మోసం చేసారని, ప్రత్యేకహోదా ఉద్యమాన్ని అణిచివేస్తున్నారని, జగన్ను విమానాశ్రయంలోనే నిర్బంధించటం, మహిళా పార్లమెంటేరియన్ సందర్భంగా మహిళలపై చేసిన స్పీకర్ వ్యాఖ్యలను, ఓటుకునోటు కేసులో చంద్రబాబు పాత్రను విద్యార్ధుల ద్వారానే మాట్లాడించారు. ప్రత్యేకహోదా పోరాటంలో విద్యార్ధులపై కేసులు పెడితే తమ ప్రభుత్వం రాగానే కేసులు ఎత్తేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్ధులపై కేసులు పెడుతున్న చంద్రబాబునాయుడుపైనే ‘టాడా’ కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించటం గమనార్హం.
