వల్లభనేని వంశీతో పనిచేయలేం: సజ్జలకు తేల్చి చెప్పిన దుట్టా వర్గం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పనిచేయలేమని దుట్టా రామచంద్రారావు తేల్చి చెప్పారు. గురువారం నాడు రాత్రి సీఎంఓ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రారావులతో చర్చించారు.

Not interested to work With Gannavaram MLA Vallabhaneni Vamsi says Dutta Ramachandra Rao

అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తాము కలిసి పనిచేయలేమని వైసీపీ నేత దుట్టా రామచంద్రారావు వర్గం తేల్చి చెప్పింది. 

గురువారం నాడు రాత్రి Gannavaram ఎమ్మెల్యే Vallabhaneni Vamsi కి ప్రత్యర్ధి వర్గం దుట్టా రామచంద్రారావు ఆయన అల్లుడు వైసీపీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ శివభారత రెడ్డిలతో సీఎంఓ అధికారులు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు చర్చించారు. 

సీఎంఓ సెక్రటరీ కె. ధనుంజయరెడ్డి గురవారం నాడు దుట్టా రామచంద్రారావు, Siva Bharath Reddyలతో మాట్లాడారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో తమకున్న సమస్యలను సీఎంఓ సెక్రటరీ ధనుంజయ్ రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు.

నియోజకవర్గంలో అక్రమంగా క్వారీల నిర్వహణ, మట్టి అమ్మకాలు చేయిస్తున్నారని వంశీపై తయారు చేసిన నివేదికను దుట్టా రామచంద్రరావు CMO అధికారులకు అందించారని సమాచారం. వంశీతో కలిసి పనిచేయలేమని కూడా స్పష్టం చేశారని తెలిసింది. వంశీని వివరణ తీసుకున్న తర్వాత  మళ్లీ మాట్లాడుతామని Dutta Ramachandra Rao కు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy చెప్పారని సమాచారం. వీరిద్దరితో భేటీ ముగిసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో  సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే  వంశీతో  చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సజ్జల రామకృష్ణారెడ్డికి మరో కార్యక్రమం ఉన్నందున సోమవారం నాడు  కలవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఈ సమావేశం ముగిసిన తర్వాత దుట్టా రామచంద్రారావు మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీతో కలిసి పనిచేయబోమని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబానికి సాయం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. అవమానాలు భరించి మరొకరి వెంట తిరగాల్సిన అవసరం తమకు లేదన్నారు.  వైసీపీ కేడర్ ను వంశీ తొక్కేస్తున్నాడని కూడా దుట్టా రామచంద్రరావు ఆరోపించారు. ఈ కారణంగానే తాను రాజకీయాల్లో యాక్టివ్ గా లేనని కూడా దుట్టా రామచంద్రారావు చెప్పారు.

వల్లభనేని వంశీకి,దుట్టా రామచంద్రారావు వర్గానికి మధ్య కొంత కాలంగా గ్యాప్ కొనసాగుతుంది. ఇటీవల కాలంలో ఈ గ్యాప్ మరింత పెరిగింది. దీంతో ఇరువర్గాలను సీఎంఓకు పిలిపించారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

also read:గన్నవరం వైసీపీలో పొగలు సెగలు: జగన్ వద్దకు పంచాయతీ... వల్లభనేని వంశీ, దుట్టాలకు సీఎంవో నుంచి పిలుపు

2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నుండి TDPఅభ్యర్ధిగా వల్లభనేని వంశీ పోటీ చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే ఆ సమయం నుండి దుట్టా రామచంద్రరావు వర్గానికి వంశీ వర్గానికి మధ్య గ్యాప్ ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios