Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాంధ్రకు తెలంగాణా సందేశం

  • తెలంగాణా విడిపోయాక, ఉత్తరాంధ్ర,రాయలసీమలలో ’ప్రత్యేక’ గుర్తింపు భావం బలపడుతూ ఉంది.
  • ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం గురించి యోచన చేయండని తెలంగాణా ప్రభుత్వం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ త్తరాంధ్ర  ప్రజలకు సలహా  ఇస్తున్నారు.
north Andhra qualified for separate state

2019 పరుగుపందెం  ఆంధ్రప్రదేశ్ లో  సృష్టిస్తున్న సందడి అంతా ఇంతకాదు. పక్కవాడు ఏమ్మాట్లాడుతున్నాడో కూడా వినబడనంత రణగొణ ధ్వని చుట్టూర అలుము కుంటూ వుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ’నేనే నెంబర్ వన్ ’ అని అరుస్తూ సర్వేలను, ఇన్వెస్టర్ల తో  కుదుర్చుకున్న ఎంవోయులను చూపిస్తున్నారు. దావోస్ సమావేశానికి రమ్మని రాసిన లేఖ కూడా ఘనవిజయంగా ’లౌడ్ స్పీకర్ల’ లో ప్రచారమువుతూ ఉంది. ప్రాస, తన దైన యాస కలిపి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం టన్ను లకొద్దిచేస్తున్న సాయం, దూసుకుపోతున్న అమరావతి, ఆంధ్రప్రగతి గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా బాగానే స్తోత్రం చేస్తూ   ఉన్నారు.

 

’ఇదంతా బోగస్, అసలు ప్రోగ్రెస్ ప్రత్యేక హోదా వస్తేనే’ అని ప్రతిపక్ష నాయకుడు  జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా తిరుగుతున్నారు. నిన్న విశాఖలో ’జై ఆంధ్ర ప్రదేశ్’ సభల ఉద్యమం వేలజనం మధ్య ప్రారంభించారు.

 

ఈ మధ్యలో సినిమా నటుడు జనసేన నేను వస్తున్నా అనితన గొంతు కలుపేందుకుచూస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా తమ వంతు సౌండ్ జత చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి వాతావరణంలో ’నోరు లేనోళ్లు’ చేసే ధ్వని వినిపిచడం కష్టం. ఈ బలహీనులు ఏకంటికీ  ఆనరు.  పత్రికల ఫ్రంటు పేజీలో వాళ్లకు జాగా దొరకదు.

 

ఆదివారం నాడు ఇలాంటిదే జరిగింది. అమూల శ్రీకాకుళంలో, హంగు అర్భాటం లేని ప్రెస్ క్లబ్ లో ఆసక్తికరమయిన చర్చ నడించింది. ఇలాంటి చర్చలు సాధారణంగా నాలుగు గోడలు దాటి బయటకు రాలేవు. వచ్చినా  జిల్లా ఎడిషన్లు దాటి ఆ ధ్వని తరంగాలు ప్రయాణించలేవు.

 

చాలా పత్రికల జిల్లా ఎడిషన్లలో ఒక ఆసక్తికరమయిన  చర్చ గురించిన చిన్న వార్త ఉంది.అయితే,  అసలు సందేశం చాలా వాటిలో మరుగున పడి ఉంది.

 

ఆంధ్రులను సెటిలర్స్ అని, వాళ్లు వలస పాలకులని ’మా తెలంగాణా మాకు’ అని ఉద్యమం చేసి తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న సంగతి తెలిసిందే. వలసాంధ్ర వ్యతిరేకతే తెలంగాణా ప్రజలను ఐక్యంచేసిన సెంటిమెంట్. తెలంగాణా ప్రభుత్వం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా శ్రీకాకుళం చర్చ నడిచింది.  ఆయన నిన్న రెండు సమావేశాలలో పాల్గొన్నారు. రెండింటా ఒకటే సందేశం, ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలి. అక్కడి జనం ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు.

 

ప్రెస్ క్లబ్ లో జరిగిన ఒక చర్చలో ఆంధ్రా యూనివర్శిటి మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కెఎస్ చలం, కుల  నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు మిస్కకృష్ణయ్య, మానవ హక్కుల వాది కష్ణ, నల్లి ధర్మా రావు వంటి సీనియర్ జర్నలిస్టులు, అనేక మంది ప్రాంతీయ ప్రగతి వాదులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్న ఈ రెండు  సమావేశాలలో రెండు విషయాలు  చర్చకు వచ్చాయి.

 

కొప్పుల ఈశ్వర్  ఇచ్చిన ప్రతేక ఉత్తరాంధ్ర రాష్ట్రం సందేశం ఒకటి. ఈ ప్రాంతంలో పెరిగిపోతున్న బయటి ప్రాంతాల వ్యాపర రాజకీయ వేత్తల పట్టు రెండోది.  ఈ ప్రాంతంలో విస్తారంగావనరులున్నాయి, కోటి మంది జనాభా ఉంది కాబట్టి అభివృద్ది కోసం  ప్రత్యేక  రాష్ట్రం అవసరమని  ఈశ్వర్ చెప్పారు. ఈ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర అర్హత ఉందని కూడా చెప్పారు. తెలంగాణా నాయకుడిని ఈసమావేశానికి ఆహ్వానించడం, అక్కడ ప్రత్యేక రాష్ట్రం నినాదం చేయించడం అంత తేలికగా కోట్టేయడానికి వీల్లేని విషయం. తెలంగాణా విడిపోయాక, ఉత్తరాంధ్ర,రాయలసీమలలో ’ప్రత్యేక’ గుర్తింపు భావం బలపడుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల వల్ల ఈ ప్రాంతాలు ఉద్యమిస్తాయని, ఈ ప్రాంతానికి చెందిన మేధావి డాక్టర్ ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రికి కనీసం ఒక వంద ఉత్తరాలు రాసి ఉంటారు.

 

 ఈ సమావేశాలలో బలంగా వినిపించిన మరొక వాదన వలస వాదం. వలస వచ్చి సెటిలవుతున్న  వ్యాపార వేత్తలకు ఈ ప్రాంతం ఎలా అభయారణ్యంగా మారుతూ ఉందన్న విషయం కూడా ప్రస్తావనకు రావడం విశేషం. విశాఖ పట్ణణం బయటి వారి చేతుల్లోకి పోయినట్లే లెక్క. ఇపుడు విశాఖ ఆంధ్రప్రదేశ్ అర్ధిక  రాజధానిగా ఎదుగుతున్న క్రమంలో , ఎపుడో కాంగ్రెస్ ప్రారంభించిన ఈ విధానం,  బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారస్థులు పెత్తనం చేసే స్థాయికి వెళ్లింది. విశాఖ నుంచి ఈ వ్యాపారస్థులు గనులు,ఇండస్ట్రీ, ఎన్నికల్లో పోటీ పేరుతో  ఏజన్సీలోకి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోకి విస్తరించకమానరు. విస్తరించగల సత్తా, సపోర్టు వాళ్లకు దండి గా ఉన్నాయి.

 

బాగా డబ్బులు వెదజల్లి వోట్లు కొన గలిగిన శక్తి ఉన్న కాంట్రాక్టర్లను, వ్యాపారస్థులను కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు  వైజాగ్ నుంచి లోక్ సభకు పంపాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్, బిజెపి కూడా 2014 ఎన్నికలలో బయటి వాళ్లనే నిలబెట్టాయి. సుబ్బరామిరెడ్డి, ఉమాగజపతిరాదు, ఎంవివిఎస్ మూర్తి, నేదురుమ ల్లిజనార్దన్ రెడ్డి, పురందేశ్వరి, ఇప్పటి ఎంపి హరిబాబు ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాసరావు అంతా బయటి వారే. 2009 లో ప్రజారాజ్యం పార్టీ మాత్రమే పల్లా శ్రీనివాస్ అనే స్థానికుడికి సీటిచ్చింది.  ప్రతి ఎన్నికపుడు వలస వాదుల చర్చ నిరపాయకరం గా సాగుతూ ఉంటుంది. అయితే, అది రాజకీయ చర్చ గా మారే రోజు వస్తుంది. నిన్నటి సమావేశం ఒక చిన్నటి నిప్పురవ్వ. పరిస్థితులు అనుకూలిస్తే రాజుకుంటుంది. ప్రమాద సూచిక. 

 

Follow Us:
Download App:
  • android
  • ios