గడచిన మూడేళ్ళుగా చంద్రబాబునాయుడు అమరావతిని ప్రపంచస్దాయి రాజధానిగా నిర్మిస్తానని చెప్పటమే కానీ కార్యాచరణలోకి దిగలేదు. అమరావతి నిర్మాణం ప్రారంభమవ్వటానికి ఇంకా ఎంతకాలం పడుతుందో ప్రభుత్వమే చెప్పలేకుంది. ఇటువంటి పరిస్థితిల్లో అమరావతిని కేంద్రప్రభుత్వం ఆకర్షణీయ నగరంగా ప్రకటించటం గమనార్హం.

లేని అమరావతిని కేంద్రం స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చటం విచిత్రంగా ఉంది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీస్ మిషన్ లో భాగంగా తాజాగా మూడో విడత జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు విడుదలచేసారు. దేశవ్యాప్తంగా 30 నగరాలు ఎంపిక కాగా ఏపిలో అమరావతిని వెంకయ్య ప్రకటించారు.

విచిత్రమేమిటంటే అమరావతినగరం అన్నది ఇప్పటికైతే కేవలం ఊహల్లో మాత్రమే ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే బ్రిటన్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ డిజైన్లలో మాత్రమే ఉంది. గడచిన మూడేళ్ళుగా చంద్రబాబునాయుడు అమరావతిని ప్రపంచస్దాయి రాజధానిగా నిర్మిస్తానని చెప్పటమే కానీ కార్యాచరణలోకి దిగలేదు. అమరావతి నిర్మాణం ప్రారంభమవ్వటానికి ఇంకా ఎంతకాలం పడుతుందో ప్రభుత్వమే చెప్పలేకుంది. ఇటువంటి పరిస్థితిల్లో అమరావతిని కేంద్రప్రభుత్వం ఆకర్షణీయ నగరంగా ప్రకటించటం గమనార్హం.

స్మార్ట్ సిటీ జాబితాలో కాగితాలకు మాత్రమే పరిమితమైన అమరావతిని చేర్చేకంటే ఇంకేదైనా నగరాన్ని చేర్చుంటే బాగుండేది. ఒకవేళ అమరావతి నగర నిర్మాణం ప్రారంభమైనా అందులో ప్రభుత్వం చేయటానికి కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే, నగరం నిర్మాణం మొత్తాన్ని చంద్రబాబు సింగపూర్ కంపెనీల చేతుల్లో పెట్టేస్తున్నారు. అటువంటి అమరావతిని కేంద్రం స్మార్ట్ సిటీగా ప్రకటించటమేమిటో అర్ధం కావటంలేదు.