ఫిరాయింపు ఎంఎల్ఏకు అరెస్టు వారెంట్

First Published 23, Jan 2018, 6:46 PM IST
Non bail able arrest warrant issued to defected MLA kalamata
Highlights
  • వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏ లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నారు

వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏ లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంకు చెందిన ఎంఎల్ఏ కలమట వెంకటరమణపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. కలమట ఆమధ్య టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరకీ తెలిసిందే. వైసిపిలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దగ్దం చేసిన ఘటనలో అప్పట్లో ఎంఎల్ఏపై కేసు నమోదైంది. అయితే, తర్వాత కలమట టిడిపిలోకి ఫిరాయించినా కేసు మాత్రం అలాగే ఉంది. ఎలాగూ అధికార పార్టీలోకి ఫిరాయించారు కాబట్టి ఏ ఇబ్బందీ ఉండదనుకున్నారు. కానీ అనూహ్యంగా కేసు పోలీసు స్టేషన్ నుండి కోర్టుకు చేరుకుంది. అందుకనే కేసు విచారణకు కూడా ఎంఎల్ఏ హాజరుకాలేదు. దాంతో కోర్టు కలమటకు మంగళవారం నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేసింది.

loader