విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు ఒడిస్సా ప్రభుత్వం అంగీకరించటం లేదు. అందుకనే ప్రత్యేక రైల్వే జోన్ వచ్చే అవకశాలు దాదాపు లేనట్లే.

కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ ఊసే లేదు. రాష్ట్రం మొత్తం మీద ప్రత్యేకహోదా కోసం ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం కనీసం విశాఖ కేంద్రంగా ప్రత్యేకరైల్వే జోన్ అయినా ప్రకటిస్తుందని అందరూ ఎదురు చూసారు. దానికి తోడు చంద్రబాబునాయుడుతో సహా పలువురు అధికార పార్టీ నేతలు ప్రత్యేకరైల్వే జోన్ అంశాన్ని కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తోందని చెప్పారు. దాంతో అందరిలోనూ ఆశక్తి పెరిగింది.

అయితే, గత రెండు బడ్జెట్లలాగే ఈసారి కూడా రైల్వేజోన్ అంశంతో పాటు ఇతరత్రా రైల్వే ప్రాజెక్టుల విషయాన్ని కూడా కేంద్రం పట్టించుకున్నట్లు లేదు. దాంతో అందరిలోనూ ఒక్కసారిగా నిరాస అలుముకుంది. రాష్ట్ర విభజన జరిగినపట్టి నుండి ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వే జోన్ అంశంపై ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశాన్ని ప్రస్తావించకపోవటంతో ప్రతిపక్ష వైసీపీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేసారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు ఒడిస్సా ప్రభుత్వం అంగీకరించటం లేదు. అందుకనే ప్రత్యేక రైల్వే జోన్ వచ్చే అవకశాలు దాదాపు లేనట్లే.