పోటెత్తిన గోదావరి: ధవళేశ్వరం బ్యారేజీపై ఫోర్ వీలర్స్ కు అనుమతి నిరాకరణ
ధవళేశ్వరం బ్యారేజీపై ఫోర్ వీలర్స్ కు అనుమతిని నిరాకరించారు అధికారులు. టూ వీలర్స్ ను మాత్రమే అనుమతిని ఇచ్చారు. ధవళేశ్వరానికి గోదావరి భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజమండ్రి :Dowleswaramవద్ద Godavari నది పోటెత్తింది. ధవళేశ్వరంలో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే 18 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. శుక్రవారం నాడు రాత్రికి 20 లక్షలకుపైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ధవళేశ్వరం బ్యారేజీ పై నుండి పోర్ వీలర్స్ కు అనుమతిని నిలిపివేశారు. Two wheelers కు మాత్రమే అనుమతిని ఇచ్చారు. ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ పై నుండి Four Wheelers రాకపోకలను నిలిపివేశారు. 1986తర్వాత అంత కంటే భారీ స్థాయిలో గోదావరి నదికి వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
also read:భద్రాచలం వద్ద 70 అడుగులకు చేరిన గోదావరి: రంగంలోకి ఆర్మీ
Bhadrachalam వద్ద ఇపట్పటికే గోదారి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది. శుక్రవారం నాడు మధ్యాహ్ననికే భద్రాచలం వద్ద గోదావరి నది 70 అడుగులకు చేరింది. 1986లో 75.6 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. కానీ ఈ దఫా మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. భద్రాచలం నుండి గోదావరి నుండి భారీ ఎత్తున వరద వస్తుంది. మరో వైపు భద్రాచలం దిగువన ఉన్న గోదావరి ఉప నదుల నుండి వచ్చిన నీటితో ధవళేశ్వరానికి భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో కాటన్ బ్యారేజీపై టూ వీలర్స్ కు మాత్రమే అనుమతిని ఇచ్చారు. ఇప్పటికే భద్రాచలం బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 48 గంటల పాటు ఈ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేయనున్నారు.