నంద్యాల ఉపఎన్నికలో గెలుపోటములను పక్కన పెడితే చాలా రికార్డులనే నమోదు చేసింది. ఇంతతీవ్ర స్ధాయిలో గతంలో ఏ నియోజకవర్గంలో కూడా అధికార, ప్రధాన ప్రతిపక్షం పోటీ పడిన దాఖలాల్లేదు. నంద్యాల నియోజకవర్గంలలోనే ఈ స్దాయి పోటీ ఎందుకు జరుగుతోందంటే అందుకు కారణం నంద్యాల ఫిరాయింపు నియోజకవర్గం కాబట్టే. నిజానికి నంద్యలలో గెలిచినా, ఓడినా రెండుపార్టీల్లోనూ తేడా ఏమీ ఉండదు.

నంద్యాల ఉపఎన్నికలో గెలుపోటములను పక్కన పెడితే చాలా రికార్డులనే నమోదు చేసింది. ఇంతతీవ్ర స్ధాయిలో గతంలో ఏ నియోజకవర్గంలో కూడా అధికార, ప్రధాన ప్రతిపక్షం పోటీ పడిన దాఖలాల్లేదు. నంద్యాల నియోజకవర్గంలలోనే ఈ స్దాయి పోటీ ఎందుకు జరుగుతోందంటే అందుకు కారణం నంద్యాల ఫిరాయింపు నియోజకవర్గం కాబట్టే.

గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న టిడిపి, వైసీపీల్లో ఎవరి అజెండా వారికుంది. అందుకే ఈ స్ధాయి పోటీ జరుగుతోంది.

నిజానికి నంద్యలలో గెలిచినా, ఓడినా రెండుపార్టీల్లోనూ తేడా ఏమీ ఉండదు. నంద్యాల సీటు విషయంలో చంద్రబాబు ఫాల్స్ ప్రిస్టేజ్ కి పోవటం వల్లే ఈ పరిస్ధితి వచ్చింది. ఇక్కడ గనుక వైసీపీ గెలిస్తే, బ్రహ్మాండమేదో తల్లక్రిందులైపోతుందన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.

అదే సమయంలో ఈ స్ధానంలో టిడిపిని ఓడించి చంద్రబాబునాయుడుకు ప్రజాబలం లేదని, ప్రజలంతా చంద్రబాబు పాలనపై వ్యతిరేకంగా ఉన్నారని చాటి చెప్పాలన్నది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పట్టుదల.

ఇక, రికార్డుల విషయాలకు వస్తే ప్రధాన ప్రతిపక్ష నేత ఇన్ని రోజులు ప్రచారానికి కేటాయించటం ఓ రికార్డు. అదే సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలు, నేతలు ఉపఎన్నికలో ఈస్ధాయిలో చెమటోడ్చటం కూడా ఇదే మొదలు. గెలుపు కోసం అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది.

ఇక, అధికార పార్టీ ఖర్చు కూడా వంద కోట్లు దాటిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో మాత్రం ప్రతిపక్షం వెనకబడింది. ఇంకా పోలింగ్ కు నాలుగు రోజులుంది.

ఒక ఉపఎన్నికలో ఇంత భారీ ఖర్చు జరగటం కూడా ఇదే మొదలు. గతంలో జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీలు ఇంత ఘోరంగా ఒకరిపై మరొకరు తిట్ల దండకం అందుకున్నది కూడా లేదు. సో, ఏ విధంగా చూసినా నంద్యాల ఉపఎన్నికలో చాలా రికార్డులే నమోదవుతున్నాయి.

అందుకే యావత్ దేశమంతా ఇపుడు నంద్యాల ఉపఎన్నిక ఫలితంపైనే దృష్టి సారించాయి. పైగా ఈ ఎన్నికలో గెలిచిన వారిదే 2019 సాధారణ ఎన్నికల్లో గెలుపన్న సెంటిమెంటు కూడా బాగా ప్రచారంలో ఉంది. సెంటిమెంటు సంగతి ఎలాగున్నా ఈ ఉపఎన్నికలో ఎవరు ఓడినా, గెలిచినా ఇద్దరికీ వచ్చే కిరీటం లేదు, పోయే కిరీటమూ లేదు, అదే విచిత్రం.