పార్టీ మారడంపై స్పష్టత: కన్నీళ్ళు పెట్టుకొన్న గల్లా అరుణకుమారి

No need to quit Tdp  says Galla Aruna kumari
Highlights

బావోద్వేగానికి గురైన గల్లా అరుణకుమారి


చంద్రగిరి: తాను పార్టీ మారుతాననే విషయంలో వాస్తవం లేదని మాజీ మంత్రి గల్లా  అరుణకుమారి చెప్పారు.  చిత్తూరు జిల్లా చంద్రగిరిలో  మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పార్టీ కార్యకర్తలతో బుధవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బావోధ్వేగంతో ఆమె కన్నీళ్ళు పెట్టుకొన్నారు.

స్వాతంత్య కాలం నుండి  తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని గల్లా అరుణ కుమారి  గుర్తు చేశారు. డబ్బుల కోసం పార్టీ మారే సంస్కృతి తమకు లేదని ఆమె చెప్పారు.   కుటుంబంలో వేరే
వారికి బాధ్యతలను  అప్పగించాలని చంద్రబాబునాయుడుకు చెప్పినట్టు అరుణకుమారి చెప్పారు.

అయితే తాను పార్టీ మారుతానని తప్పుడు ప్రచార సాగుతోందని ఆమె చెప్పారు. తాను  వైసీపీలో చేరుతానని తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. కార్యకర్తలు అడిగితే కనీసం పని చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీలో చేరుతానని తనపై బురద చల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ మారాల్సిన అవసర   లేదన్నారు. 


 

loader