శ్రీకాకుళం: శ్రీకాకుళం మండలంలోని చాపురం పంచాయితీ పరిధిలోని బొందిలిపురం విజయ్‌నగర్ కాలనీలో  ఈ నెల 7వ తేదీన హత్యకు గురైన మెహరున్నీషా, జురాబాయ్‌ల కేసు మిస్టరీ వీడలేదు.

వీరిద్దరూ హత్యకు గురై ఐదు రోజులు కావస్తోన్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కన్పించలేదు. మృతదేహాలపై  హంతకుల వేలిముద్రలు లభించలేదు.  ఈ  హత్యలు జరిగిన రోజున ఇంట్లో నుండి  ఉన్న నగలను మాత్రం దుండగులు పట్టుకెళ్లలేదు.  పోలీసుల దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించారు.  

ఈ హత్యలు పోలీసులకు సవాల్‌గా మారింది.  ఈ హత్యలకు కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆస్తి తగాదాలా.... ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో  కూడ  పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఇంటికి  హత్య జరిగిన రోజున ఎవరెవరు వచ్చారనే కోణంలో కూడ పోలీసులు  ఆరా తీస్తున్నారు.  ప్రతి ఒక్కరిని  పోలీసులు విచారిస్తున్నారు.