తోడేళ్ల ముఠాతో ఒంటరిగానే పోటీ: గుడివాడలో టిడ్కో ఇళ్లు ప్రారంభించిన జగన్
ప్రజలను నమ్ముకొని తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఎంతమంది ఏకమైనా తాను ఒంటరిగానే పోటీ చేస్తానని ఏపీ సీఎం జగన్ తెలిపారు
అమరావతి: తోడేళ్లు ఏకమైనా తాను భయపడనని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. తోడేళ్ల ముఠాతో తాను ఒంటరిగా పోటీ చేస్తున్నానన్నారు. తాను మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చానని సీఎం జగన్ ప్రజలను కోరారు. మీ ఇంట్లో మంచి జరిగితే తనకు మద్దతివ్వాలని సీఎం జగన్ కోరారు. అబద్దాలను అవాస్తవాలను నమ్మవద్దని సీఎం జగన్ కోరారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏముందని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు విపక్షాలు కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అధికారంలోకి రావాలని గజ దొంగల ముఠా కోరుకుంటుందన్నారు. కానీ ఎందరూ కలిసి పోటీ చేసినా తాను మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారంనాడు గుడివాడలో టిడ్కోఇళ్లను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.
తమ ప్రభుత్వం 300 చదరపు అడుగుల ఇళ్లను రూపాయికే ఇస్తుందని సీఎం జగన్ చెప్పారు.రాష్ట్రంలో ప్రతి లబ్దిదారుడికి ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.రెండు నుండి రూ. 10 లక్షల వరకు ఉంటుందన్నారు.
also read:కుప్పంలో ఒక్క చాన్సిస్తే ప్రతి ఇంటికి కిలో బంగారం: బాబుపై జగన్ సెటైర్లు
8,859 ఇళ్లకు అదనంగా జూలై7న మరో 4200 ఇళ్లను మంజూరు చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి గజ దొంగల ముఠాకు అధికారం కావాలని కోరుకుంటుందన్నారు.
ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను 90 శాత అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు . లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.