Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఏ పార్టీతో పొత్తుండదు: వీరప్పమెయిలీ

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ  జాతీయ నేత వీరప్ప మెయిలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తుపెట్టుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. విజయవాడలో పర్యటించిన వీరప్ప మెయిలీ కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఆరోపించారు.

no allaince in ap congress
Author
Vijayawada, First Published Sep 4, 2018, 9:16 PM IST

విజయవాడ : రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ  జాతీయ నేత వీరప్ప మెయిలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తుపెట్టుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. విజయవాడలో పర్యటించిన వీరప్ప మెయిలీ కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఆరోపించారు.

 రక్షణ సంబంధమైన అంశాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దేశ రక్షణ కోసం 126 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రాఫెల్‌ ఒప్పందం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసిందన్నారు. రాఫెల్ డీల్ ద్వారా రిలయన్స్‌ కంపెనీకి ఎన్డీయే ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్నారు. 

రాఫెల్ డీల్ కు 12 రోజుల ముందు అనిల్‌ అంబానీ కంపెనీ ఏర్పాటు చేశారని తద్వారా 61 వేల కోట్ల రూపాయల భారీ కాంట్రాక్టును దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఎటువంటి అనుభవం లేని ఇలాంటి కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడమంటే రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని మొయిలీ విమర్శించారు.

 మరోవైపు రాఫెల్‌ కుంభకోణం‍పై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని వీరప్పమెయిలీ స్పష్టం చేశారు. రాఫెల్ డీల్ పై పీపీసీ వెయ్యాలని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్ చేస్తున్నప్పటికీ బీజేపీ వెయ్యడం లేదని మండిపడ్డారు. ప్రతీ వేదికపై రాహుల్‌ గాంధీ రాఫెల్ డీల్ పై ఆరోపణలు చేస్తున్నామోదీజీ మాత్రం మౌనంగానే ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 

రాఫెల్ డీల్ కుంభకోణంపై సెప్టెంబరు 12న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మెమోరాండం అందిస్తారని తెలిపారు. అదే విధంగా 24న గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్‌ పార్టీ తరపున మెమోరాండం అందజేస్తామని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios