Asianet News TeluguAsianet News Telugu

జగన్ కి షాకిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ

కానీ గడ్కరీ ఏపీకి వచ్చాక సీను మారిపోయింది. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరు బాగుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ కలిగిన నాయకుడని ప్రశంసించారు.

nitin gadkari shock to jagan and prises chandrababu

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. వైసీపీ అధినేత జగన్ కి ఊహించని షాక్ ఇచ్చారు.  పోలవరం నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. గడ్కరీ ఏపీకి వస్తున్నారనగానే.. ముందుగా సంతోషించింది వైసీపీ నేతలే. ఎందుకంటే.. పోలవరంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని.. వాటి లెక్క తేల్చేందుకే గడ్కరీ వస్తున్నారంటూ చాలా మంది వైసీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో చంద్రబాబు భయంతో వణికిపోతున్నారని కూడా పేర్కొన్నారు.

కానీ గడ్కరీ ఏపీకి వచ్చాక సీను మారిపోయింది. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పనితీరు బాగుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ కలిగిన నాయకుడని ప్రశంసించారు. రూ.6,688 కోట్ల విలువైన వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబుతో కలిసి గడ్కరీ శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ ప్రసంగించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ మాకు ప్రత్యేక రాష్ట్రమే. నవ్యాంధ్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. పోలవరం ప్రాజెక్టు జాతి సంపద. సివిల్‌ పనులన్నీ ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించాం. గోదావరి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళిక రూపొందించాం’’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 70 శాతం సమస్యలన్నీ తన శాఖల పరిధిలోనే ఉన్నాయని... తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా ఏపీ అభివృద్ధినే కోరుకుంటున్నారని వివరించారు.

చంద్రబాబు ఇరకాటంలో పడతానడి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు ఎంతగానో ఎదురుచూశారు. కానీ అనూహ్యంగా నితిన్ గడ్కరీ.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదని సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios