Asianet News TeluguAsianet News Telugu

ఈ విషయాల్లో మీ సర్కార్ భేష్..: సీఎం జగన్ తో సమావేశంలో నీతిఆయోగ్‌ బృందం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్  రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో నీతి ఆయోగ్ అధికారుల బృందం కలిసింది. ఈ సందర్భంగా ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020–21 రిపోర్ట్ ను సీఎంకు అందజేశారు. 

NITI Aayog team meets AP CM YS Jagan
Author
Amaravati, First Published Aug 13, 2021, 4:29 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను నీతిఆయోగ్‌ సలహాదారు శాన్యుక్తా సమద్దార్, ఎస్‌డీజీ ఆఫీసర్‌ అలెన్‌ జాన్, డేటా ఎనలటిక్స్‌ ఆఫీసర్‌ సౌరవ్‌ దాస్, ఏపీ ప్రణాళికాశాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసారు. క్యాంప్‌ కార్యాలయంలో సీఎంను కలిసిన నీతిఆయోగ్ బృందం ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020–21 రిపోర్ట్ ను అందజేశారు. 

నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీస్‌) ఇండియా ఇండెక్స్‌ 2020–21, మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌(ఎంపీఐ)పై రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ జరిగింది. ఎస్‌డీజీ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రాన్ని మొదటి స్ధానంలో నిలిపేందుకు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలనే అంశంపై ఈ వర్క్ షాప్ లో చర్చించారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనపై రాష్ట్ర, జిల్లా స్ధాయి అధికారులకు నీతిఆయోగ్‌ ఆధ్యర్యంలో దిశానిర్ధేశం చేసినట్లు సీఎంకి వివరించింది నీతిఆయోగ్ అధికారుల బృందం. 

read more  నకిలీ చలాన్ల కుంభకోణం: సీఎం జగన్ ఆరా, సమగ్ర దర్యాప్తుకు ఆదేశం

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వివిధ రంగాల అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యతను నీతిఆయోగ్‌ సభ్యులకు వివరించారు సీఎం. ఏపీ ప్రభుత్వం సుస్ధిరాభివృద్ది లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించుకునేందుకు కృషిచేస్తోందని వెల్లడించారు నీతిఆయోగ్ అధికారులు. నవరత్నాలలో భాగంగా వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేయడంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రశంసించింది నీతిఆయోగ్‌  బృందం. 

Follow Us:
Download App:
  • android
  • ios