సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేపట్టారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియాకు చెందిన యూనస్‌ను మూడు నెలల కిందట ఎన్‌ఐఏ అధికారారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూనస్ అత్తమ్మ గ్రామమైన ఆళ్లగడ్డలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్‌ఐఏ ఎస్పీ రాజీవ్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. యూఎస్ బంధువుల ఇళ్లలో కూడా ఎన్‌ఐఏ సోదాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతంలో కూడా ఎన్‌ఐఏ అధికారులు ఆళ్లగడ్డలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఇక, యూనస్ కర్ణాటక పీఎఫ్‌ఐలో కీలకంగా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. గతంలో నంద్యాల కేంద్రంగా కార్యకలాపాలు జరిపాడు. 2022లో ఎన్‌ఐఏ సోదాలు సమయంలో కర్ణాటకలోని బళ్లారికి పారిపోయాడు. అక్కడ పీఎఫ్‌ఐ సభ్యులకు శిక్షణ కార్యకలాపాలను కొనసాగించాడు.