విజయవాడ: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జగన్ పై దాడి కేసును విచారిస్తున్న ఎన్ఐఏ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. 

ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తికి చార్జిషీట్‌ను సమర్పించింది. చార్జిషీట్ తోపాటు నిందితుడు శ్రీనివాసరావు జైలులో రాసిన 22 పేజీల పుస్తకాన్నికూడా జత చేసింది. చార్జిషీట్‌ కాపీని ఎవరికీ అందకుండా చూడాలని, గోప్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందిని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. 

ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ అధికారులు స్పష్టం చేశారు. చార్జిషీట్‌లో ఏముందో అనేది ఈ నెల 25న తెలిసే అవకాశం ఉంది. 

ఈ కేసులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా అత్యవసరంగా చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రీనివాస్ తరఫున న్యాయవాది మట్టా జయకర్‌ ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో స్టే వేసింది. 

అయితే ఎన్ఐఏ విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. ప్రభుత్వం వేసిన పిటీషన్ పై ఈనెల 30లోపు కౌంటర్ దాఖలు చెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఇకపోతే ఈ అంశం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారం నేపథ్యంలో ఈకేసును సుప్రీంకోర్టులో విచారించాలంటూ వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు కోరిన విషయం తెలిసిందే. కేసు విచారణ ఈనెల 30కి వాయిదా వేసినప్పటికీ ఇంతలోనే ఎన్ఐఏ దూకుడు ప్రదర్శించి చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడి కేసు: చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

జగన్ పై దాడి కేసు: ఫ్లెక్సీ, లేఖపై ఎన్ఐఏ అధికారుల ఆరా

జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణకు హాజరైన వైసీపీ నేతలు వీరే

జగన్ పై దాడి కేసు: హైకోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురు

బెజవాడలో శ్రీనివాసరావుకు ముప్పు: రాజమండ్రి జైలుకు తరలింపు

ప్రజలతో మాట్లాడనిస్తే అంతా చెప్తా.. జగన్ పై దాడి కేసు నిందితుడు

జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్

ఎన్ఐఏకు జగన్‌పై దాడి కేసు: హైకోర్టులో బాబు సర్కార్ పిటిషన్

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం