ఏపీ, తెలంగాణలోని ప్రజా సంఘాల నాయకులపై జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. మావోయిస్టులపై సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వారిపై అభియోగాలు మోపారు.

ఏపీ, తెలంగాణలోని ప్రజా సంఘాల నాయకులపై జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. మావోయిస్టులపై సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వారిపై అభియోగాలు మోపారు. మొత్తం ఏడుగురిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

మావోయిస్టులకు మద్ధతిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాల నాయకులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కేతో ప్రజా సంఘాలకు సంబంధాలున్నాయనే ఆరోపణలు వున్నాయి.

వైజాగ్‌కు చెందిన బంగి నాగన్న కేసులో వీరిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విరసం నేత మానుకొండ శ్రీనివాస్, జంగాల కోటేశ్వరరావు, బొప్పుడి అంజమ్మ, అందులూరి అన్నపూర్ణ, రేలా రాజేశ్వరిలపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.