విశాఖపట్టణం: పాకిస్తాన్ కు ఇండియాకు చెందిన రహస్యాలను  అందించిన నేవీ ఉద్యోగులకు భారీగానే డబ్బులు ముట్టజెప్పినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.

ఇండియాకు చెందిన నేవీ రహస్యాలను అందించిన నేవీ ఉద్యోగులతో పాటు వారి సన్నిహితులు, కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో  భారీగా డబ్బులు జమ చేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. 

ముంబైకి చెందిన హవాలా ఆపరేటర్లు ఇంతియాజ్ సయ్యద్, షేక్ సహిస్థాలు పాకిస్తాన్ హ్యాండర్ల నుండి వచ్చే ఆదేశాల మేరకు సంబంధిత నేవీ ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు వేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.

 ఉగ్రవాదుల  కార్యక్రమాల్లో  భాగస్వామ్యులు అవతున్న విషయాన్ని బ్యాంకు ఖాతాల్లో పాక్ నుండి డబ్బులు జమ చేయడం ద్వారా తేట తెల్లమైందని  ఎన్ఐఏ అభిప్రాయపడింది. 

నిందితులను ఈ నెల 18, 22 తేదీల్లో కస్టడీకి తీసుకొని ఎన్ఐఏ విచారిందచింది. ఈ విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకొన్నట్టుగా సమాచారం. నిందితులు ఫేస్‌బుక్, ఈ మెయిల్ ఖాతాల ద్వారా పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ప్రతినిధులతో సంభాషించినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.

Also read:పాకిస్తాన్‌తో లింకులు: విజయవాడలో ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్ట్

టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకొని నిందితులు ఉపయోగించిన ఫేస్‌బుక్,, ఈ మెయిళ్లలో ఎన్ఐఏ అధికారులు ఆధారాలు సేకరించారు. అంతేకాదు  కీలకమైన డాక్యుమెంట్లను ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఎప్పుడెప్పుడు నిందితులు పాక్ కు చెందిన వారితో మాట్లాడారనే విషయమై ఎన్ఐఏ అధికారులు విశ్లేషిస్తున్నారు.