జూన్ ఏడున ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
విశాఖపట్నం: ఇరు తెలుగురాష్ట్రాల్లోనూ రానున్న మూడురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ(జూలై 5) ఉభయ రాష్ట్రాలలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని...రేపు(జూలై 6) పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని ప్రకటించింది. ఇక జూన్ ఏడున ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.జూలై ఎనిమిదో తేదీన తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగగా... రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిది.
ఇక వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుతుపవనాలు ఉత్తరభారత దేశాన్ని దాటి పశ్చిమ ప్రాంతాలకు వ్యాపించలేకపోతున్నాయి. దీంతో రాజస్తాన్, డిల్లీ, యూపి పశ్చిమప్రాంతాలు, చండీఘడ్, హర్యానాలకు వర్షాకాలం ఇంకా మొదలవలేదు. ఈ పరిస్థితి మరో అయిదు రోజులుంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
read more వర్షంలో బైక్ నడుపుతున్నారా.. ఈ 5 తప్పులను చేయకండి మిమ్మల్ని ప్రమాదాల నుండి నివారిస్తుంది..
ఇటీవల కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోడుమూరు మండలం వరుకూరు దగ్గర తుమ్మల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద నీటిలో హెచ్‌పీ గ్యాస్ లారీ వాగులో చిక్కుకుపోయింది. దీంతో స్థానికులు లారీ డ్రైవర్‌ను అతి కష్టం మీద తాళ్ల సహాయంతో బయటకు లాగారు. ఈ వర్షాల కారణంగా కర్నూలు- ఆదోనీ మధ్య రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
మంత్రాలయం మండలం రచ్చమరి దగ్గర భారీ వర్షాలకు వాగులు, వంకలు పోర్లుతున్నాయి. సీడ్ పత్తిపంట, ఉల్లి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. నందవరం-నాగుల దిన్నె మధ్య వాగు ఉద్ధృతి కారణంగా రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గోనెగండ్ల మండలం హెచ్ కైరావాడిలో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరుకుంది. ఎమ్మిగనూరులో ముకతిపేట, లక్ష్మీనగర్, శివన్ననగర్ , వీవర్స్ కాలనీలోకి వర్షపు నీరు చేరి మగ్గాలు తడిశాయి. దీంతో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. నందవరంలో ఎస్సీ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది.
