Asianet News TeluguAsianet News Telugu

పెద్దల్ని కాదని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.. ఇంటికి వచ్చి ఫ్యాన్ కు ఉరేసుకుని నవదంపతుల దారుణం...

మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దంపతులిద్దరూ పై అంతస్తులోకి వెళ్లారు.  ఫోన్ కింది అంతస్తులో ఉండిపోవడంతో దాన్ని తీసుకుని వెళ్ళిన ఒక యువకుడు ఇద్దరూ రెండు ఫ్యాన్లు hang చేసుకుని ఉన్న విషయాన్ని గమనించి కేకలు వేశాడు.  

newly married couple suicide, mystery in srikakulam
Author
Hyderabad, First Published Oct 28, 2021, 10:24 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.  ఒక్కటే బతకాలని నిర్ణయించుకున్నారు జీవితంలో స్థిరపడ్డాక పోయిన పెద్దలను కాదని దూరంగా వెళ్లి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.  భవిష్యత్తుపై  బెంగో.. కన్న వాళ్ళు క్షమిస్తారని ఆశనో..  యాభై రోజుల తర్వాత సొంతూరుకు వచ్చారు. అంతా అక్కున చేర్చుకుంటారు అని భావించారు. 

అందరితో కలిసి జీవించాలని తపించారు,  కానీ వీరు ఒకలా తలిస్తే,  విధి మరోలా మరణశాసనం రాసింది.  ఆవేదన, క్షణికావేశంలో  వారు తీసుకున్న నిర్ణయం కన్నవారికి కడుపుకోతను  మిగిల్చింది. నిండు నూరేళ్లు కలిసి జీవితం అనుకున్న newly married couple అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన రేగిడి మండలం  తునివాడ లో బుధవారం చోటు చేసుకుంది.
  
తునివాడ గ్రామానికి చెందిన పల్లి హరీష్ (29),  రుంకు దివ్య (20)  కొంతకాలంగా ప్రేమించుకున్నారు.  ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని ఉద్దేశంతో వారిని కాదని ఇటీవల స్నేహితుల సమక్షంలో అన్నవరం ఆలయంలో marriage చేసుకున్నారు.  ఆ తరువాత స్వగ్రామానికి రాకుండా విశాఖపట్నంలోనే కాపురం పెట్టారు.  ఇలా జీవితం సాగిపోతున్న క్రమంలో  కన్నవారి వైపు మనసు మళ్లింది.

 వారిని చూసొద్దామని ఇద్దరూ సంతోషంగా బుధవారం గ్రామం లో అడుగుపెట్టారు.  పెళ్లి అయి 50 రోజులు కావడంతో  కోపతాపాలు మరిచిపోతారని, అంత ఆదరిస్తారని భావించారు.  తప్పు చేశాను అమ్మ అంటూ తల్లి ని పట్టుకుని హరీష్ ఏడ్చేశాడు. లేని బిడ్డ అని ముద్దుగా చూసుకున్న ఆ తల్లి కుమారుడిని ఓదార్చి ఇంట్లోకి తీసుకువెళ్ళింది.

హయత్ నగర్ కారులో మృతదేహం.. భార్యతో పాటు మరో ఇద్దరు అరెస్ట్...

 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దంపతులిద్దరూ పై అంతస్తులోకి వెళ్లారు.  ఫోన్ కింది అంతస్తులో ఉండిపోవడంతో దాన్ని తీసుకుని వెళ్ళిన ఒక యువకుడు ఇద్దరూ రెండు ఫ్యాన్లు hang చేసుకుని ఉన్న విషయాన్ని గమనించి కేకలు వేశాడు.  వెళ్లి చూసేసరికి ఇద్దరు విగతజీవులుగా కనిపించారు.

జీవితంలో ఎదగాలని... 
ఎంసీఏ చదివిన హరీష్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. విశాఖలో శిక్షణ తీసుకుంటున్నాడు.  డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసింది.  యాభై రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కానీ వీరి బలవన్మరణానికి కారణం అంతుపట్టడం లేదు పాలకొండ సీఐ శంకరరావు, రేగిడి ఎస్సై మహమ్మద్ అలీ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. 

బంధువులు, కన్నవారి నుంచి వివరాలు సేకరించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు లో అన్ని విషయాలు తెలుస్తాయని ఎస్ఐ తెలిపారు.

కన్నవారికి కడుపుకోత

ఇద్దరు తీసుకున్న నిర్ణయం కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. తండ్రి చిన్న నాయుడు చనిపోయిన కొడుకు హరీష్ ను ప్రయోజకులుగా చేయాలని తల్లి అందుకు తగ్గట్లే ఉన్నతంగా చదివించింది. ఎంసీఏ వరకు కొడుకు చదవడంతో ఉన్నత ఉద్యోగం వస్తుందని మురిసిపోయింది. ఇంతలో ఇలా జరగడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. అన్న పుట్టినరోజు వేడుక గుర్తుకురాలేదా అంటూ దివ్య తల్లిదండ్రులు మంజుల శ్రీనివాసరావు కన్నీటిపర్యంతమయ్యారు. దివ్య సోదరుడు అవినీతి పుట్టిన రోజు శుక్రవారం కావడంతో వేడుక చేయాలని అనుకున్నారు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios