సెలక్ట్ కమిటీ ఏర్పాటులో ట్విస్ట్: వైసీపీ కొత్త వాదన
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సెలక్ట్ కమిటీ ఏర్పాటు అంశం కీలక మలుపు తిరిగింది. సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి సభ్యుల పేర్లు ఇవ్వాల్సిందిగా ఇప్పటి వరకు పార్టీలకు లేఖలు చేరలేదని, దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సెలక్ట్ కమిటీ ఏర్పాటు అంశం కీలక మలుపు తిరిగింది. సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి సభ్యుల పేర్లు ఇవ్వాల్సిందిగా ఇప్పటి వరకు పార్టీలకు లేఖలు చేరలేదని, దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.
సెలక్ట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని మూడు రోజుల క్రితమే మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. ఇప్పటి వరకు సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు లేఖలు రాయకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే అంతా నిబంధనల ప్రకారమే చేశామని టీడీపీ చెబుతోంది.
Also Read:ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వైజాగే బెస్ట్.. కానీ ఇబ్బందులు కూడా: జీఎన్ రావు
బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని వైసీపీ వాదిస్తోంది. కాగా పాలనా వికేంద్రీకరణ బిల్లులు, సీఆర్‌డీఏ బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమ పార్టీలకు చెందిన సభ్యుల పేర్లను ఇవ్వాలని ఏపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ఆదివారం నాడు ఆయా రాజకీయ పార్టీలకు లేఖ రాశారు.
ఒక్కో కమిటీలో కనీసం తొమ్మిది మంది ఉంటారని శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు. ప్రతి సెలెక్ట్ కమిటీలో టీడీపీ నుండి ఐదుగురు,వైసీపీ, బీజేపీ, పీడీఎఫ్ నుండి ఒక్కో సభ్యుడు ఉన్నారు.
శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు ఆయా సెలెక్ట్ కమిటీలకు ఛైర్మెన్లుగా ఉంటారు. ఆయా కమిటీల్లో ఉండే సభ్యుల పేర్లను ఇవ్వాలని మండలి ఛైర్మెన్లు ఆదివారం నాడు షరీఫ్ లేఖ రాశారు.
Also Read:నిపుణుల సలహాలు తీసుకున్నాం.. వ్యాపారస్థులవి కాదు: బాబుపై బొత్స సెటైర్లు
ఏపీ శాసనమండలిలో టీడీపీకి 32 మంది సభ్యులున్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మాణిక్యవరప్రసాద్ రాజీనామా ఇంకా ఆమోదం తెలపలేదు.
దీంతో మాణిక్య వరప్రసాద్ టెక్నికల్ గా మెంబర్ గా కొనసాగుతున్నట్టే.నని చెబుతున్నారు. శాసనమండలిలో బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలు ఆయా కమిటీలకు ఛైర్మెన్ లుగా ఉంటారు.