నరసరావుపేటలో ఎస్ఐపై ఫిర్యాదు చేసిన మహిళ సింధూ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మీడియా ముందుకొచ్చిన సింధు మాజీ భర్త సుబ్బారావు అసలు విషయాన్ని వీడియోల రూపంలో బయటపెట్టాడు.

మొన్నామధ్య విజయవాడలో ఓ మహిళ బైక్‌పై కూర్చొని బీర్ తాగే వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అందులో ఉన్నది సింధూనే అని ఆమె భర్త సుబ్బారావు వెల్లడించారు.

సింధూ డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తుందన్న ఆయన.. మద్యానికి కూడా బానిస అయ్యిందని తెలిపాడు. సింధు దగ్గరున్న పిల్లలు.. తనకు, ఆమెకు పుట్టినవారేనని సుబ్బారావు చెప్పాడు.

సింధూతో ఎస్ఐ జగదీశ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా పలువురు ప్రముఖుల్ని సింధూ బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేస్తుందని ఆయన తెలిపాడు.

Also Read:నన్ను లొంగదీసుకుని, బెదిరిస్తున్నాడు: ఎస్ఐపై మహిళ ఫిర్యాదు

సింధూతో తనకు 2010లో వివాహం జరిగిందని.. 2017లో తామిద్దరం విడాకులు తీసుకున్నామని పేర్కొన్నాడు. విడాకులు కూడా సింధూనే దరఖాస్తు చేసిందని సుబ్బారావు చెప్పాడు. తమ బాబు పుట్టినతేదీ, ఆధార్ కార్డులు కూడా మార్చిందని.. చివరికి తప్పుడు పత్రాలు సృష్టించి ఫించన్ కూడా పొందుతోందని సుబ్బారావు వెల్లడించాడు.

కాగా ఎస్ఐ జగదీశ్ తనను మోసం చేశాడంటూ సింధూ నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనకు, తన కుమారుడికి ఎస్ఐ వల్ల ప్రాణహానీ వుందని మహిళ వాపోయింది.

తన భర్తతో గొడవల కారణంగా.. ఏడు సంవత్సరాల క్రితం నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని సింధూ చెప్పింది. ఆ సమయంలో స్టేషన్ ఎస్ఐగా జగదీశ్ పనిచేస్తున్నారని.. తనను ఇంటికి పిలిపించుకుని బలవంతంగా బలాత్కారం చేశాడని సింధూ తన ఫిర్యాదులో పేర్కొంది.