కృష్ణా జిల్లా గుడివాడలో ఎస్ఐ విజయకుమార్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన బలవన్మరణానికి పాల్పడిన సమయంలో అతని ప్రియురాలు సురేఖ ప్లాట్‌లోనే వున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లా గుడివాడలో ఎస్ఐ విజయకుమార్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన బలవన్మరణానికి పాల్పడిన సమయంలో అతని ప్రియురాలు సురేఖ ప్లాట్‌లోనే వున్నట్లు తెలుస్తోంది.
4 నెలల క్రితం వేరే అమ్మాయిని విజయకుమార్ పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్యా వివాదం నెలకొంది. ఇదే సమయంలో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానంటూ బాత్‌రూమ్ గడియ పెట్టుకుంది సురేఖ.
అప్పటికే మద్యం మత్తులో వున్న విజయ్ కుమార్ ఈ పరిణామంతో కంగారుపడి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. బయటకు వచ్చి విగతజీవిగా పడివున్న విజయ్‌ని చూసి సురేఖ భయాందోళనలకు గురైంది. దీంతో సురేఖపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేపు ఆమెను అదుపులోకి తీసుకోనున్నారు.
విజయకుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఆయన గతంలో రైల్వేలో ఎస్సైగా పనిచేశారు. అనంతరం కృష్ణా జిల్లా ముసునూరు గుడ్లవల్లేరు, మండవల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం గుడివాడ టూ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
విజయ్ కుమార్ హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా సురేఖతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో అక్రమ సంబంధం ఆరోపణలపై గతంలో ఆయన సస్పెండ్ అయ్యాడు. ఇదే క్రమంలో రెండు నెలల క్రితం విజయ్ కుమార్ వివాహం జరిగింది.
