బొబ్బిలి-సాలూరు మధ్య కొత్త రైలు

First Published 21, Dec 2017, 3:48 PM IST
New train between saluru and bobbili in vijayanagaram dt soon
Highlights
  • విజయనగరం జిల్లాలోని బొబ్బిలి-సాలూరు రైల్వే మార్గంలో త్వరలో కొత్త రైలు రెడీ అయ్యింది.

  విజయనగరం జిల్లాలోని బొబ్బిలి-సాలూరు రైల్వే మార్గంలో త్వరలో కొత్త రైలు రెడీ అయ్యింది. రైలుబస్సు స్థానంలో  రైలు నడపటానికి కేంద్రం రంగం సిద్దం చేసింది. ఇందుకోసం వారణాసిలో ట్రైన్ కూడా సిద్ధమైంది. ఇంతవరకు నడిచిన రైలుకు ముందు, వెనుక ఉండే ఇంజన్ ద్వారా ఎటువైపు వెళ్లాలంటే అటువైపు పైలెట్ డ్రైవ్ చేసే వాడు. ఇది నాలుగు నెలలుగా తిరగడం లేదు. ఇంజన్లో సాంకేతిక లోపంతో తరచూ ఈ సర్వీసు రద్దవుతోంది. దాంతో జనాల ఆధరణ కూడా తగ్గిపోయింది.

సాలూరు, బొబ్బిలి మున్సిపల్ పట్టణాలు, నియోజవర్గ కేంద్రాలను కలుపే ఈ లైన్ 1957లో ప్రతిపాదించారు. అప్పటి ఎంపీగా గెలుపొందిన డిప్పల సూరిదొర డిమాండ్ తో ఈ లైనుకు కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్థల పరిశీలన, భూ సేకరణ తరువాత లైన్ ఏర్పాటైంది.  అప్పటి నుండి మొన్నటి వరకూ అదే రైలు నడుస్తోంది.

అయితే, అది తరచూ రిపేర్లకు వస్తుండటంతో ప్రయాణీకులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకని కొత్తగా డీఈఎమ్యూ పేరుతో డీజిల్ తో నడిచే నాలుగు కోచుల సమర్ధ్యం గల కొత్త రైలును రైల్వేశాఖ సిద్ధంమైనట్లు రైల్వే వర్గాల సమాచారం.  అయితే పాత రైల్ ఉదయం 6, 8, 11 గంటలకు, సాయంత్రం 4, 6, 7.30 సమయాల్లో నడిచేది. కొత్తగా వేయనున్న ట్రైన్ బొబ్బిలి స్టేషన్కు వచ్చే పాసింజర్, డీఎమ్యూ, ఇతర ఎక్స్ ప్రెస్ లతో లింకు పెట్టటంతో  సాలూరు ప్రాంత ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది.

loader