అమరావతి: కోవిడ్ 19సెకండ్ వేవ్ విషయంలో పూర్తి స్థాయిలో ఏపి ప్రభుత్వం అప్రమత్తంగా వుందని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిపేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు.

''కోవిడ్ 19 కొత్త వెరియంట్ ప్రయాణికులు ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తుండడంతో విమాన ప్రయాణికుల రాకపోకలపై ద్రుష్టి పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశించారు. విదేశీ విమానాల్లో ప్రయాణించి రాష్ట్రానికి చేరుకున్న వారికి ఆర్టిపిసిఆర్ టెస్ట్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించాం. ప్రత్యేకంగా విమానశ్రయాల్లోనే ప్రయాణికులకు పరీక్షలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించాం'' అని మంత్రి వెల్లడించారు.

''విమానాశ్రయాల్లో ప్రయాణికులు, సిబ్బంది కోసం పిపిఈ కిట్స్ అందుబాటులో ఉంచాలని కూడా సీఎం జగన్ అదేశించారు. పొరుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్ లు కూడా ఏర్పాటు చేస్తున్నాం'' అని తెలిపారు.

''తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యూకే నుండి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఇలా పాజిటివ్ వచ్చిన మహిళకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా డిఎంహెచ్‌వో తో ఈరోజు ఉదయం ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నాను'' అని మంత్రి నాని తెలిపారు. 

read more రాజమండ్రిలో కొత్త రకరం వైరస్ కలకలం: తప్పించుకు వచ్చిన మహిళకు వైరస్

''యూకే నుండి వచ్చి ఏపీ ఎక్స్‌ప్రెస్ లో రాష్ట్రానికి వచ్చిన మహిళకు పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్ నుండి రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆమెతో పాటు ఆమె కుమారున్ని కూడా రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు'' అన్నారు.

''తాజా పరిణామాలు నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసాం. మహిళకు సోకిన కరోనా వైరస్ కొత్త వెరియంటా... కాదా అనేది నిర్ధారణ చేసే పనిలో తూర్పుగోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు. నమూనాలు సేకరించి పరీక్షలు నిమిత్తం పూణే ల్యాబ్ కు పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు'' అని తెలిపారు.

''ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ముందుస్తూగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా నిబంధనలు. ప్రజలు కూడా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మరింత అప్రమత్తంగా ఉండాలి'' వైద్యారోగ్య శాఖ మంత్రి సూచించారు.