ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని (ys jagan) నూతన డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి (kasireddy rajendranath reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీగా అవకాశం కల్పించినందుకు రాజేంద్రనాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ నూతన డీజీపీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని (ys jagan) నూతన డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి (kasireddy rajendranath reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం ఆయన సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీజీపీగా అవకాశం కల్పించినందుకు రాజేంద్రనాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ నూతన డీజీపీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కాగా.. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. గౌతమ్ సవాంగ్ (gowtham sawang) డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి గౌతమ్ సవాంగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. సీఎం జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సీఎం జగన్ ఆదేశాలను గౌతమ్ సవాంగ్ తప్పుకుండా అమలు చేస్తారనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవల ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం.. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం.. గౌతమ్ సవాంగ్‌పై వేటు వేసిందనే ప్రచారం జరుగుతుంది.
అయితే గౌతం సవాంగ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా.. జీఏడీలో రిపోర్ట్ చేయమనడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గౌతం సవాంగ్ పోస్టింగ్‌పై క్లారిటీ వచ్చింది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు గౌతం సవాంగ్‌ను డీజీపీగా రిలీవ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం సీఎం జగన్‌ను (ys jagan) ఆయన కలిశారు.
ఇకపోతే .. ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా ఆయన పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగా కూడా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజీగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. సర్వీస్‌లో జాతీయస్థాయిలో రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తింపు పొందారు.
