విదేశీయులకోసం ‘విశాఖ’లో ప్రత్యేక బీచ్

విదేశీయులకోసం ‘విశాఖ’లో ప్రత్యేక బీచ్

విదేశీయులను ఆకర్షించేందుకు కేంద్రప్రభుత్వం కొత్త తరహా బీచ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంటే ఇప్పటికే కేరళ, గోవా తదితర ప్రాంతాల్లో ఉన్న  బీచ్ ల తరహా లాంటివి మాత్రం కావు. బీచ్ లను ఎంపిక చేసి ప్రత్యేకంగా విదేశీయుల కోసమే అభివృద్ధి చేస్తారు. ఈ బాధ్యతను కేంద్రం ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్ధకు అప్పగించింది. బీచ్ ల ఏర్పాటుకు కేంద్రం దేశం మొత్తం మీద పది ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో విశాఖపట్నం బీచ్ కూడా ఒకటి.

బీచ్ లను గుర్తించిన ఫౌండేషన్ బీచ్ ల అభివృద్ధి, నిర్వహణ కోసం రూ. 2 కోట్లు ఖర్చు చేస్తుంది. మొత్తం పూర్తయిన తర్వాత ఫౌండేషన్ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది. విదేశీయులు బీచ్ కు రావాలంటే ఈ సర్టిఫికేట్ చాలా అవసరం. సర్టిఫికేట్ ఉంటేనే విదేశీయులు బీచ్ లోకి అడుగుపెడతారు. ఇటువంటి సర్టిపికేట్ ఉన్న బీచ్ లు ప్రస్తుతం స్పెయిన్ తో పాటు మరికొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి. మనదేశంలో మాత్రం ఏవీలేవు.

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రావాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. అవేంటంటే, తీరం స్వచ్చంగా ఉండాలి. సముద్రంలో ఎటువంటి కాలుష్యం అంటే మురుగునీరు, పరిశ్రమల వ్యర్ధాలు కలవకూడదు. సముద్రంలో స్నానం చేసేటపుడు ఆరోగ్యపరమైన భద్రత ఉండాలి. నీటిలో బ్యక్టీరియా ఉండకూడదు. పర్యావరణం ఆహ్వాదకరంగా ఉండాలి. 150 మీటర్ల వరకు తీరం నుండి లోపలకు ఇసుక తిన్నెలుండాలి. సముద్రంలో బోటింగ్ సదుపాయం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ లభిస్తుంది. ఏదేమైనా కొత్త తరహా బీచ్ లు ఏర్పాటవ్వటం మంచిదే కదా?

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page