YCP: నెల్లూరులో వేమిరెడ్డి దారిలోనే సుబ్బారెడ్డి.. పార్టీకి రాజీనామా.. త్వరలోనే టీడీపీలోకి
నెల్లూరు వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత తాజాగా ఆ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి కూడా రాజీనామా చేశారు.
Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీ ముఖ్య నాయకులు పార్టీని వీడుతున్నారు. ఇటీవలే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడి షాక్ ఇచ్చారు. ఆయన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, వైసీపీ రాజ్యసభ ఎంపీగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీలోకి చేరే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే దారిలో నెల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి కూడా వెళ్లుతున్నారు.
చేజర్ల సుబ్బారెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు ఆయన వైసీపీకి రాజీనామా సమర్పించారు. అంతేకాదు.. తాను కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంటే నడుస్తానని వివరించారు. ఆయనతోనే తన ప్రయాణం అని స్పష్టం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసే తెలుగు దేశం పార్టీలో చేరుతానని తెలిపారు.
Also Read: Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ రిపోర్టు ప్రకారమే వైసీపీకి 40 సీట్లు: జనసేన నేత పోతిన మహేశ్
చేజర్ల సుబ్బారెడ్డి ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారు. ఎంపీపీగా ప్రస్థానం సాగించారు. వైసీపీకి అత్యంత విధేయుడిగా ఉన్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఈ సారి టికెట్ రాకపోవడంతో ఆయన టీడీపీకి సన్నిహితంగా మారుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ అధిష్టానంపై విమర్శలు చేస్తే.. చేజర్ల సుబ్బారెడ్డి వాటిని తిప్పికొట్టేవారు. కానీ, ఇప్పుడు ఆయనే వైసీపీకి ఎదురుతిరుగుతున్నారు.