ఆంధ్ర ప్రదేశ్ లోని మరో అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు రూరల్. ప్రస్తుతం ఈ నియోజవర్గ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే 2004, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తేవస్తున్న కోటంరెడ్డి ఇటీవల టిడిపిలో చేరారు. అంటే ఇప్పటివరకు టిడిపి ఓడించిన వ్యక్తే ఈసారి టిడిపి అభ్యర్థి అయ్యాడన్నమాట. ఇలా నెల్లూరు రూరల్ లో రాజకీయ సమీకరణలు మారడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. 

నెల్లూరు రూరల్ రాజకీయాలు :

2008 లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఏర్పడింది. ఇది ఏర్పడినప్పటి నుండి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా రెండుసార్లు వైసిపిదే విజయం. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోటంరెడ్డి వైసిపి తరపున పోటీచేసి విజేతగా నిలిచారు. 

అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడంటూ కోటంరెడ్డిని వైసిపి నుండి సస్పెండ్ చేసారు. కానీ ఆయన అంతకంటే ముందే టిడిపికి దగ్గరయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నుండి పోటీచేసారు. 

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. నెల్లూరు రూరల్ మండలం
2. నెల్లూరు పట్టణంలోని పలు వార్డులు

నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,54,641
పురుషులు - 1,24,128
మహిళలు ‌- 1,30,477

నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరపున పోటీచేసి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా మారిపోయాడు. దీంతో వైసిపి సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ పోటీలో నిలిపింది. 

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ ఇటీవలే వైసిపిలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ బరిలో నిలిపింది. 

నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,58,406 (60 శాతం)

వైసిపి - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - 85,724 ఓట్లు (51 శాతం) - 22,776 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - అబ్దుల్ అజీజ్ - 64,948 ఓట్లు (39 శాతం) - ఓటమి

నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

వైసిపి- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - 79,103 (49 శాతం) - 25,653 ఓట్ల మెజారిటీతో విజయం 

బిజెపి - సన్నపురెడ్డి సురేష్ రెడ్డి - 53,653 (33 శాతం) - ఓటమి