నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లకూరు వద్ద ఇవాళ తెల్లవారుజామున  ప్రయాణికుల జీపును వేగంగా వచ్చిన ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు మృతిచెందగా మరో ఎనిమిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. 

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం నాయుడుపాలెంకి చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం ఓ జీపులో తిరుమలకు బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణఇస్తున్న వాహనం పెళ్లకూరు సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఓ ట్రావెల్ బస్ ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాద ఘటనపై  దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన వారు ఇలా ప్రమాదానికి గురవడంతో నాయుడుపాలెం లో విషాద చాయలు అలుముకున్నాయి.