రాష్ట్రానికి , దేశానికి ఉద్ధండులైన నేతలను అందించింది సింహపురి. దశాబ్ధాలుగా నెల్లూరు రాజకీయాలను రెడ్డి సామాజికవర్గమే శాసిస్తోంది. పార్టీ ఏదైనా సరే నేతలు మాత్రం ఈ వర్గానికి చెందినవారే. పుచ్చలపల్లి సుందరయ్య, వెంకయ్య నాయుడు, సీతారాం ఏచూరి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆనం బ్రదర్స్, మేకపాటి ఫ్యామిలీలు నెల్లూరు నుంచే రాజకీయాలను శాసించాయి. వర్గ విభేదాలు, ముఠా కక్షలు, ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలతో పొలిటిక్స్ ఎప్పుడూ భగభగమండుతూ వుంటాయి. అసలు రాజకీయం అంటనే నెల్లూరు.. నెల్లూరు అంటేనే రాజకీయం అన్నంతగా పరిస్ధితి వుంటుందంటే అతిశయోక్తి కాదు. తొలి నుంచి కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న నెల్లూరులో ఇప్పుడు వైసీపీ పట్టు పెంచుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రస్తావించాల్సి వస్తే నెల్లూరు పేరు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. ఉమ్మడి ఏపీ అయినా, నవ్యాంధ్ర అయినా నెల్లూరు రాజకీయం ప్రత్యేకం, విభిన్నం. రాయలసీమకు అతి దగ్గరగా వుండే ఈ నగరం .. అసలు సిసలు రాజకీయాలకు కేంద్రం. వర్గ విభేదాలు, ముఠా కక్షలు, ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలతో పొలిటిక్స్ ఎప్పుడూ భగభగమండుతూ వుంటాయి. అసలు రాజకీయం అంటనే నెల్లూరు.. నెల్లూరు అంటేనే రాజకీయం అన్నంతగా పరిస్ధితి వుంటుందంటే అతిశయోక్తి కాదు. పెన్నానదికి ఇరువైపులా విస్తరించి వున్న నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో తొలి నుంచి రాజకీయ చైతన్యం ఎక్కువ. 

రాష్ట్రానికి , దేశానికి ఉద్ధండులైన నేతలను అందించింది సింహపురి. దశాబ్ధాలుగా నెల్లూరు రాజకీయాలను రెడ్డి సామాజికవర్గమే శాసిస్తోంది. పార్టీ ఏదైనా సరే నేతలు మాత్రం ఈ వర్గానికి చెందినవారే. పుచ్చలపల్లి సుందరయ్య, వెంకయ్య నాయుడు, సీతారాం ఏచూరి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆనం బ్రదర్స్, మేకపాటి ఫ్యామిలీలు నెల్లూరు నుంచే రాజకీయాలను శాసించాయి. తొలి తరంలో బెజవాడ, ఆనం కుటుంబాలు.. ఆ తర్వాత ఆనం, నేదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబాలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశాయి. బడా కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు నెల్లూరు ఖ్యాతి గాంచింది. 

నెల్లూరు ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. వైసీపీ కంచుకోట : 

1952లో ఏర్పడిన నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 14 సార్లు విజయం సాధించగా.. వైసీపీ 3 సార్లు, టీడీపీ, స్వతంత్రులు ఒక్కొక్కసారి గెలిచారు. 1957 నుంచి 1998 వరకు కాంగ్రెస్‌ అప్రతిహత విజయాలు సాధించింది. నెల్లూరు లోక్‌సభ పరధిలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి అసెంబ్లీ స్థానాలున్నాయి.

నెల్లూరులో మొత్తం ఓటర్లు 16,72,845 మంది.. వీరిలో పురుషులు 8,50,746 మంది.. మహిళలు 8,21,866 మంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 12,87,036 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 76.94 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నాటి పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డికి 6,83,830 ఓట్లు .. టీడీపీ అభ్యర్ధి బీద మస్తాన్ రావుకు 5,35,259 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 1,48,571 ఓట్ల మెజారిటీతో నెల్లూరును కైవసం చేసుకుంది. 

నెల్లూరు ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. పాతికేళ్లుగా గెలవని టీడీపీ :

తొలి నుంచి కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న నెల్లూరులో ఇప్పుడు వైసీపీ పట్టు పెంచుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది. 2024లోనూ మరోసారి గెలిచి నెల్లూరును నిలబెట్టుకోవాలని జగన్ భావిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి టికెట్ నిరాకరించిన సీఎం.. అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించారు.

దీంతో ఆయనకు వైసీపీ నేతలు ఏ మేరకు సహకరిస్తారో చూడాలి. ఇక టీడీపీ విషయానికి వస్తే.. సామాజికంగా, ఆర్ధికంగా బలమైన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. దీంతో ఆయననే వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ అభిమానులు, శెట్టిబలిజ, కాపు, తెలగ సామాజిక వర్గాలు కూడా ఇక్కడ బలంగా వుండటంతో పొత్తులో భాగంగా నెల్లూరును జనసేన కోరే అవకాశం వుంది.